DPRO KMNR తేది : 13-09-2021 : ఫోటోలు & ప్రెస్ నోట్ : కలెక్టరేటు ఆడిటోరియం లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజా పిర్యాదులు స్వీకరిస్తున్న లోకల్ బాడీస్ అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, జిల్లా పరిషత్ సీఈఓ ప్రియాంక (కరీంనగర్ జిల్లా).

పత్రికా ప్రకటన తేదీ: 13-9-2021
కరీంనగర్

ప్రజా సమస్యల సత్వరా పరిష్కారానికే ప్రజావాణి

జిల్లా అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్

00000

ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు
జిల్లా అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్ అన్నారు.

సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 127 మంది ప్రజల తమ సమస్యలకు సంబంధించి దరఖాస్తులను ఆమె స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజల నుండి అందిన దరఖాస్తులను పరిష్కరించుటకు వెంటనే సంబంధిత శాఖలకు పంపినట్లు ఆమె తెలిపారు. ఇందులో 70 రెవెన్యూకు సంబంధించినవి, 05 మున్సిపల్ కార్పోరేషన్ కు చెందినవి, జిల్లా మెడికల్ మరియు హెల్త్ కు చెందినవి 02,పోలీస్ కమీషనర్ కు 01 మిగితా ఇతర శాఖలకు చెందిన 49 వని ఆమె తెలిపారు. సంబంధిత అధికారులు ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను ప్రాధాన్యతతో వెంటనే పరిష్కరించాలని ఆమె అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సూపరిండెంట్ చంద్రశేఖర్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ జూవెరియా, జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. రత్నమాల, ఎల్.డి.ఎం. లక్ష్మణ్, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి రాజమనోహర్, జిల్లా సాంఘీక సంక్షేమాధికారి నేతనియల్, జిల్లా మైనార్టి అధికారి మధుసుధన్, ఏ.డి. సర్వే అండ్ ల్యాండ్ ఆర్. అశోక్, మార్కెటింగ్ డి.డి. పద్మావతి, కలెక్టరేట్ సూపరింటెండ్లు, సిబ్బంది వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
,
సహాయ సంచాలకులు, జిల్లా పౌర సంబంధాల శాఖ కార్యాలయం కరీంనగర్ వారిచే జారీ చేయడమైనది.
.

Share This Post