DPRO KMNR తేది : 13-09-2021 : ఫోటోలు & ప్రెస్ నోట్ : హుజురాబాద్ మండలం సింగపూర్ లోని ఊర చెరువులో చేప పిల్లలను వదులి అనంతరంఆబాదిజమ్మికుంట పట్టణ కేంద్రం లోని గుండ్ల చెరువులో చేప పిల్లలను వేసి అనంతరం వీణవంక మండల కేంద్రం లోని ఊర చెరువులో చేప పిల్లలను వేసి మాట్లాడుతున్న పశు సంవర్ధక శాఖ మంత్రి వర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్న జిల్లా ZP చైర్ పర్సన్ కనుమల్ల విజయ, MLC నరదాసు లక్ష్మీన్ రావు, హుస్నాబాద్ ఎమ్మెల్యే ఓడితల సతీష్ బాబు, నర్సంపేట్ MLA పెద్ది సుదర్శన్ రెడ్డి. (కరీంనగర్ జిల్లా).

పత్రికా ప్రకటన తేదీ: 13-9-2021
కరీంనగర్

మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ ధ్యేయం

కులవృత్తులకు ప్రభుత్వం పెద్ద పీట

-రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

-సింగపూర్, జమ్మికుంట, బేతిగల్ చెరువుల్లో ఉచిత చేప 2 లక్షల చేప పిల్లల విడుదల
000000

తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల అభివృద్దే లక్ష్యంగా కులవృత్తులకు పెద్దపీట వేస్తుందని, అన్నం పెట్టే ప్రభుత్వానికి ప్రజలు అండగా ఉండాలని రాష్ట్ర, మత్స్య , పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.

సోమవారం హుజురాబాద్ మండలం సింగపూర్ గ్రామం ఊర చెరువు, ఆబాది జమ్మికుంట లోని గుండ్ల చెరువు, వీణవంక మండలం బేతిగాల్ లోని ఊర చెరువుల లో ఉచిత చేప పిల్లలను మంత్రి నీటి లోకి విడుదల చేశారు. సింగపూర్ చెరువులో 60 వేలు, జమ్మికుంటలో ఒక లక్ష 5 వేలు, బెతిగల్ ఊర చెరువులో 30 వేల రాహు, బొచ్చ , మెరుగు రకానికి చెందిన చేప పిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో ఏర్పాటు చేసిన సభలలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడారు. 2014లో కెసిఆర్ ముఖ్యమంత్రి అయ్యాక మత్స్యకారులకు మాత్రమే చెరువులలో చేపల పట్టుకొని జీవనోపాధి పొందేందుకు జీవో తెచ్చారని గుర్తు చేశారు. భవిష్యత్తులో మరిన్ని కొత్త కార్యక్రమాలతో మత్స్యకారులకు అన్ని విధాల చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందని పేర్కొన్నారు. చెరువులో పోసిన చేప పిల్లలు పెరిగాక మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుందని, మత్స్యశాఖ ఫెడరేషన్ ద్వారా చేపలను కొనుగోలు చేసి ఎగుమతి చేస్తామని మంత్రి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు రైతు బంధు, రైతు బీమా, దళితులకు దళిత బందు పథకం చేపట్టినట్లు గానే మత్స్యకారుల అభివృద్ధికి అన్ని విధాలా ప్రభుత్వం పాటు పడుతుందని మంత్రి తెలిపారు. కాలేశ్వరం ప్రాజెక్టు వల్ల జలాశయాలు నిండుకుండలా మారాయని, అన్ని జిల్లాల లోని చెరువుల్లో సమృద్దిగా నీళ్ళు వున్నాయని మత్స్యకారుల జీవనోపాధికి ఎలాంటి డోకా వుండదని మంత్రి తెలిపారు.తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పథకాలు గత ఎడు ఏళ్ల నుంచి సాగుతున్నాయని, ఇది నిరంతరాయంగా కొనసాగు తాయని తెలిపారు.ఇది ఎన్నికల జిమ్మిక్ కాదని అన్నారు.ఈ ఏడాది 93 కోట్ల చేప, 25 కోట్ల రొయ్య పిల్లలు చెరువులు, రిజర్వాయర్ లలో విడుదల చేస్తున్నామని అన్నారు.

ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, హుస్నాబాద్ ఎమ్మెల్యే వి. సతీష్ బాబు, జెడ్పీ ఛైర్పర్సన్ కనుమల్ల విజయ, జిల్లా మత్స్య సహకార సంఘం మాజీ అధ్యక్షుడు పొలు లక్ష్మణ్, మత్స్య శాఖ కమిషనర్ బుఖ్య లచ్చిరాం, మత్స్య శాఖ జిల్లా సహాయ సంచాలకులు రాజనర్సయ్య,హుజురాబాద్ ఆర్డీవో రవీందర్ రెడ్డి, జెడ్పీటీసీ లు, ఆయా గ్రామాల సర్పంచులు, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర రావు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

సహాయ సంచాలకులు జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం కరీంనగర్ గారిచే జారీ చేయడమైనది.

Share This Post