DPRO KMNR తేది : 13-09-2021 : ఫోటోలు & press note : కలెక్టరేటు సమావేశ మందిరంలో జరిగిన డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో మాట్లాడుతున్న లోకల్ బాడీస్ అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ (కరీంనగర్ జిల్లా).

పత్రికా ప్రకటన

తేదీ:13-09-2021

డయల్ యువర్ కలెక్టర్ సమస్యలను ప్రాధాన్యతతో వెంటనే పరిష్కరించాలి

లోకల్ బాడీస్ అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్
00000

డయల్ యువర్ కలెక్టర్ కు ప్రజలు తెలిపే సమస్యలను ప్రాధాన్యత ఇచ్చి వెంటనే పరిష్కరించాలని లోకల్ బాడీస్ అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో కలిసి డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని ఆమె నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దూర ప్రాంతాల నుండి జిల్లా కేంద్రానికి రాలేని ప్రజల సమస్యల పరిష్కారానికి డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి వచ్చిన ప్రజాసమస్యలు పెండింగ్ లేకుండా వెంటవెంటనే పరిష్కరించాలని లోకల్ బాడీస్ అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ అధికారులను ఆదేశించారు. గంగాధర మండలం నుండి మహేష్ మాట్లాడుతూ తన సర్వే నెంబర్ ఆన్ లైన్ లో రావడం లేదని ఫిర్యాదు చేశారు, పరిశీలించి వెంటనే పరిష్కారం చేస్తామని ఆమె తెలిపారు. రామడుగు మండల కెంద్రం నుండి శ్రీనివాస్ మాట్లాడుతూ సబ్సీడీ క్రింద పాత మీటర్లను తొలగించి, కొత్త మీటర్లు అమర్చాలని ఇంతకు ముందుకు వచ్చిన కరెంటు బిల్లు క్లీయర్ చేయాల్సిందిగా ఫిర్యాదు చేశారు, పరిశీలించి పరిష్కరిస్తామని తెలిపారు. రేకుర్తి నుండి పద్మ మాట్లాడుతూ తన పొలం చుట్టూ తాడి చెట్లు ఉన్నాయని, వాటితో నష్టం కలుగుచున్నదని ఫిర్యాదు చేశారు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిశీలించి పరిష్కరించాలని అదనపు కలెక్టర్ తెలిపారు. హుజురాబాద్ నుండి రవి మాట్లాడుతూ డ్రైనేజీల నుండి మురికి నీరు ప్రవహించుట వలన దోమల, కలర, మలేరియా తదితర సీజనల్ వ్యాధులు ప్రభాలుతాయని ఫిర్యాదు చేశారు, మున్సిపాలిటీ వారికి తెలిపి వెంటనే పరిష్కరిస్తామని ఆమె తెలిపారు. జమ్మికుంట మండలం అంకుశపూర్ నుండి రాజు మాట్లాడుతూ వ్యవసాయ భూమి తన తండ్రి గారి పేరు ఉన్నదని, దాన్ని తన అమ్మ పేరు మీద మార్చడం జరిగింది, కాని మీ-సేవా లో రావడం లేదని ఫిర్యాదు చేశారు, పరిశీలించిన వెంటనే పరిష్కరిస్తామని ఆమె తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సూపరిండెంట్ చంద్రశేఖర్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ జూవెరియా, జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. రత్నమాల, ఎల్.డి.ఎం. లక్ష్మణ్, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి రాజమనోహర్, జిల్లా సాంఘీక సంక్షేమాధికారి నేతనియల్, జిల్లా మైనార్టి అధికారి మధుసుధన్, ఏ.డి. సర్వే అండ్ ల్యాండ్ ఆర్. అశోక్, మార్కెటింగ్ డి.డి. పద్మావతి, కలెక్టరేట్ సూపరింటెండ్లు, సిబ్బంది వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
,

సహాయ సంచాలకులు, జిల్లా పౌర సంబంధాల శాఖ కార్యాలయం కరీంనగర్ వారిచే జారీ చేయడమైనది

.

Share This Post