DPRO KMNR తేది : 13-09-2021 : ఫోటోలు & press note: పాత్రికేయూల సమావేశం లో మాట్లాడుతున్న పశు సంవర్ధక శాఖ మంత్రి వర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నMLA రసమయి బాలకిషన్. (కరీంనగర్ జిల్లా).

పత్రికా ప్రకటన

తేదీ:13-09-2021

మత్స్యకారుల సంక్షేమానికే ఉచిత చేప పిల్లల పంపిణీ

రాష్ట్రంలో 115 కోట్లతో 93 కోట్ల చేప,10కోట్ల రొయ్య పిల్లలను ఉచితంగా చెరువులలో విడుదల

రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య,డెయిరి అభివృద్ధి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
0000
మత్స్యకారుల ఆర్థికాభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా చెరువులలో ఉచిత చేప పిల్లలను విడుదల చేస్తున్నామని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.

సోమవారం తిమ్మాపూర్ మండలం ఎల్.ఎం.డి. గెస్ట్ హౌజ్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో శాసన సభ్యులు, చైర్మన్ తెలంగాణ సాంస్కృతిక సారథి రసమయి బాలకిషన్ తో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ సంవత్సరము రాష్ట్రంలో 115 కోట్ల రూపాయల ఖర్చుతో 93 కోట్ల చేప పిల్లలను, 10 కోట్ల రొయ్య పిల్లలను ప్రభుత్వం ద్వారా ఉచితంగా చెరువులలో, రిజర్వాయర్ లలో విడుదల చేస్తున్నామని తెలిపారు. దీని ద్వారా మత్స్యకారులు చేపలను పట్టుకొని మార్కెట్లో అమ్ముకొని ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారని తెలిపారు. మత్స్యకారులు చేపలను అమ్ముకొనుటకు వీలుగా ద్విచక్ర వాహనాలు, ఫోర్ వీలర్ వాహనాలను ఇచ్చామని తెలిపారు. అణగారిన ప్రజల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో వినూత్న అభివృద్ధి సంక్షేమా పథకాలను ప్రవేశపెట్టి అమలుచేస్తుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో 24 గంటల నాణ్యమైన కరెంటు సరఫరా చేస్తున్నామని అన్నారు. మిషన్ కాకతీయ, ఇరిగేషన్ ప్రాజెక్ట్ లు, కాళేశ్వరం ప్రాజెక్టు ల ద్వారా బీడు భూములు సస్యశ్యామలం అయ్యాయని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వినూత్న ఆలోచనల మేరకు చేపట్టిన ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో పుష్కలంగా నీరు ఉండడం వల్ల పంటలు పుష్కలంగా పండాయని తెలిపారు. వ్యవసాయాన్ని ప్రోత్సహించుటకు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతులందరికి రైతుబంధు, రైతు భీమా పథకాలు ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు. పేద కుటుంబాలలోని ఆడ పిల్లల పెళ్లికి అప్పుల పాలు కాకుండా కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టి లక్ష 116 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు. వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు ఆసరా పెన్షన్లు ఇస్తున్నామని తెలిపారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి రాష్ట్ర ముఖ్యమంత్రి పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను ప్రవేశపెట్టి ప్రతి గ్రామంలో నర్సరీలను ఏర్పాటు చేశామని, డంపింగ్ యార్డులు, స్మశాన వాటికలను నిర్మించామని, ప్రతి గ్రామానికి ఒక ట్రాక్టర్ కొనుగోలు చేసి పారిశుద్ద్య పనులకు, హరితహారం పనులకు వినియోగించుకుంటున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక వివిధ సంక్షేమ పథకాల వల్ల ప్రజల ఆత్మ గౌరవం పెంచుతున్నామని అన్నారు. ప్రభుత్వం కుల వృత్తులను ప్రోత్సహిస్తూ వారిని ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేస్తున్నామని అన్నారు. ప్రభుత్వం చేపట్టిన ఇరిగేషన్ ప్రాజెక్టుల వల్ల తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక వరి ధ్యానం ఉత్పత్తి అయిందని తెలిపారు. కరోనాతో రాష్ట్రం ఆర్థికంగా నష్టాల్లో ఉన్న రైతులు పండించిన ప్రతి చివరి గింజ వరకు కనీస మద్ధతు ధర పై కొనుగోలు చేశారని తెలిపారు. ప్రభుత్వం ఎల్లప్పుడు ప్రజలకు అండదండలుగా ఉంటుందని, ప్రజల బాగోగుల కోసమే ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి తెలిపారు. దళిత బంధు పథకం కావాలని ఎవరు అడగలేదని, రాష్ట్ర ముఖ్యమంత్రి దళితులను ఆర్థికంగా అభివృద్ధిపర్చాలనే ధృడ సంకల్పంతో దళిత బంధు పథకాన్ని పైలేట్ ప్రాజెక్టుగా హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రవేశపెట్టి అమలు చేస్తున్నామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ పథకం ప్రవేశపెట్టిన రాష్ట్రం అంతా అమలు చేస్తుందని, అలాగే దళిత బంధు పథకం కూడా రాష్ట్రం అంతా అమలు చేస్తామని అన్నారు. ప్రజల్లో చాలా చైతన్యం వచ్చిందని, ఏ ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో గమనిస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రజలందరూ ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న వివిధ సంక్షేమ అభివృద్ధి పథకాల పట్ల చాలా సంతోషంగా ఉన్నారని, ప్రజల అండదండలు ప్రభుత్వానికి మెండుగా ఉన్నాయని తెలిపారు.

ఈ పాత్రికేయుల సమావేశంలో మానకొండూర్ శాసన సభ్యులు, రాష్ట్ర సాంస్కృతిక సారధి చైర్మన్ రసమయి బాలకిషన్, తదితరులు పాల్గొన్నారు.

సహాయ సంచాలకులు, జిల్లా పౌర సంబంధాల శాఖ కార్యాలయం కరీంనగర్ వారిచే జారీ చేయడమైనది..

Share This Post