పత్రికా ప్రకటన తేదీ :14-08 -2021
కరీంనగర్
గ్రామ సభల ద్వారా దళిత బంధు లబ్ధిదారుల ఎంపిక
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరిష్ రావు
-000
ప్రత్యేక అధికారుల ఆద్వర్యం లో గ్రామ సర్పంచులు, ఎంపిటిసిలు, దళిత బంధు కో-ఆర్డినేటర్లు, దళితుల సమక్షంలో గ్రామ సభలు నిర్వహించి దళిత బంధు లబ్ధిదారులను ఎంపిక చేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరిష్ రావు అన్నారు.
శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాష్ట్ర మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్, మండల ప్రత్యేక అధికారులు, దళిత బంధు మండల కో-ఆర్డినేటర్లతో మంత్రి దళిత బంధు పై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ నెల 16న హుజురాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు పథకాన్ని లాంచనంగా ప్రారంభిస్తారని తెలిపారు. ప్రారంభ కార్యక్రమంలో 15 మంది అతి పేద దళితులకు దళిత బంధు ఆర్థిక సహాయం చెక్కులు ముఖ్యమంత్రి చేతుల మీదుగా అందజేస్తారని అన్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలో గల అన్ని గ్రామాలలో తహశీల్దార్, ఎంపీడీవో స్థాయికి తగ్గకుండా ప్రత్యేక అధికారులు గ్రామాలలో గ్రామ సర్పంచులు, ఎంపిటిసిలు, వార్డు సభ్యులు,ఇతర ప్రజా ప్రతినిధులు,దళితుల సమక్షంలో గ్రామ సభలు నిర్వహించి పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలని అన్నారు. లభ్దిదారుల జాబితా గ్రామ పంచాయితీ కార్యాలయము గోడలపై ప్రదర్శిస్తారని తెలిపారు. అర్హులైన లబ్ధిదారులందరికి సాచులేషన్ మోడ్ లో దళిత బంధు మంజూరు చేస్తామని తెలిపారు. పండుగ వాతావరణంలో లబ్ధిదారుల యూనిట్లు గ్రౌండింగ్ చేయాలని సూచించారు.
ఈ సమావేశంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర పౌర సరఫరాలు, బి.సి. సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, ప్రభుత్వ విప్ బాల్కా సుమన్, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కనుమల్ల విజయ, రాష్ట్ర ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్, పోలీస్ కమీషనర్ వి. సత్యనారాయణ, శాసన సభ్యులు సుంకె రవి శంకర్, ఆర్వురి రమేష్, సండ్ర వెంకట వీరయ్య, నగర మేయర్ వై.సునీల్ రావు నగర పాలక సంస్థ కమీషనర్ వల్లూరి క్రాంతి, అదనపు కలెక్టర్లు శ్యాం ప్రసాద్ లాల్, గరీమా అగర్వాల్, అసిస్టెంట్ కలెక్టర్ మయాంక్ మిట్టల్, జిల్లా పరిషత్ సి.ఈ.వో. ప్రియాంక, దళిత బంధు మండల రీసోర్స్ పర్సన్లు, మండల ప్రత్యేక అధికారులు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
జారీ చేసిన వారు సహాయ సంచాలకులు, సమాచార పౌర సంబంధాల శాఖ కరీంనగర్