DPRO KMNR తేది :15 -08 -2021 : ఫోటోలు & ప్రెస్ నోట్ : యాభై వేల లోపు పంటరుణాలు మాఫీ చెక్కును అందజేస్తున్నరాష్ట్ర పౌరసరఫరాలు, బిసిసంక్షేమ శాఖమంత్రిగంగులకమలాకర్. (కరీంనగర్ జిల్లా).

పత్రికా ప్రకటన తేదీ :15-08 -2021
కరీంనగర్

జిల్లాలో 54.86 కోట్లతో 50 వేల లోపు పంట రుణాలు మాఫీ
రాష్ట్ర పౌర సరఫరాలు, బి.సి. సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్
-000-

జిల్లాలో పంట రుణ మాఫీ పథకం 2018 క్రింద 25 వేల నుండి 50 వేల వరకు గల పంట రుణాలను మాఫీ చేయుటకు 54 కోట్ల 86 లక్షల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేయటం జరుగుతుందని రాష్ట్ర పౌర సరఫరాలు, బి.సి. సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో 50 వేల లోపు పంట రుణాల మాఫీకి సంబంధించి 54.86 కోట్ల రూపాయల చెక్కును జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్, జిల్లా వ్యవసాయాధికారి, లీడ్ బ్యాంకు మేనేజర్ కు మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో 25 వేల నుండి 50 వేల వరకు గల పంట రుణాలను మాఫీ చేయుటకు ప్రభుత్వం 16,053 రైతులను అర్హులుగా గుర్తించి 54.86 కోట్లు రూపాయలను వారి ఖాతాల్లో జమ చేయుటకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. వెంటనే రైతుల ఖాతాల్లోకి పంట రుణాల మాఫీ రూపాయలు సంబంధిత రైతుల ఖాతాల్లో జమ చేయబడుతావని మంత్రి తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్, పోలీస్ కమీషనర్ వి. సత్యనారాయణ, అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్, జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్, ఎల్.డి.ఎం. లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.
జారీ చేసిన వారు సహాయ సంచాలకులు, సమాచార పౌర సంబంధాల శాఖ కరీంనగర్

Share This Post