పత్రికా ప్రకటన తేదీ :15-08 -2021
కరీంనగర్
దేశ భక్తుల త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం
అదనపు కలెక్టర్ జి.వి. శ్యాం ప్రసాద్ లాల్
-000-
ఎందరో దేశభక్తుల త్యాగాల ఫలితంగా దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందని అదనపు కలెక్టర్ జి.వి. శ్యాం ప్రసాద్ లాల్ అన్నారు.
ఆదివారం కలెక్టరేట్ ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహాం వద్ద 75 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పలు ప్రతిష్టాత్మమక పథకాలు ప్రవేశపెడుతుందని, ప్రజలు వాటిని సద్వినియోగం చేసుకొవాలని తెలిపారు. దళుతుల అభ్యున్నతి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ దళిత బంధు పథకం తీసుకోవడం అభినందనీయం అని అన్నారు. దళిత బంధు పథకం కరీంనగర్ జిల్లా నుంచి చేపట్టడం శుభ సూచకం అని పేర్కొన్నారు. ఉద్యోగులు ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా పని చేయాలని సూచించారు. కరీంనగర్ ఉద్యోగులు నిబద్ధతతో పనిచేస్తారు కనుకనే దళిత బంధు పథకాన్ని ప్రథమంగా జిల్లా నుంచి ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు. దళిత బంధు పథకం అమలుకు జిల్లా అధికారులందరూ కృషి చేసి విజయవంతం చేయాలని కోరారు. అదనపు కలెక్టర్ విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ జిల్లా అధికారులు, ఉద్యుగులు, తదితరులు పాల్గొన్నారు.
జారీ చేసిన వారు సహాయ సంచాలకులు, సమాచార పౌర సంబంధాల శాఖ కరీంనగర్