DPRO KMNR తేది: 16-09-2021 : : కరీంనగర్ పట్టణం లో వాక్సినేషన్ సెంటర్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్.

పత్రికా ప్రకటన

తేదీ:16-9-2021
కరీంనగర్

జిల్లాలో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలి

జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్

వైశ్య భవన్ లో వ్యాక్సినేషన్ కేంద్రం ప్రారంభం

00000

జిల్లాలో వంద శాతం కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తిచేయడమే లక్ష్యంగా పని చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ అన్నారు.

గురువారం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో స్థానిక గాంధీ రోడ్ లోని వైశ్య భవన్ లో ఏర్పాటుచేసిన వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వంద శాతం లక్ష్యంతో వ్యాక్సినేషన్ పూర్తిచేయాలని అన్నారు. ఇప్పటివరకు 58 శాతం వ్యాక్సినేషన్ పూర్తి అయిందని, త్వరలోనే వంద శాతం లక్ష్యాన్ని చేరుకోవాలని తెలిపారు. 18 సంవత్సరాలు పై బడిన వారందరూ వాక్సినేషన్ వేసుకోవాలని కోరారు. మొదటి డోసు తీసుకున్నవారు తప్పనిసరిగా రెండవ డోసు కూడా తీసుకోవాలని సూచించారు ప్రజలందరికీ సులభతరంగా, సౌకర్యవంతంగా ఉండేందుకు డివిజన్ల వారీగా వ్యాక్సినేషన్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని ఈ సదవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు. జిల్లాలోని నగరపాలక సంస్థ, కొత్తపల్లి, హుజురాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో వ్యాక్సినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసి వంద శాతం పూర్తిచేయాలని అన్నారు. కోవిడ్ టీకా తీసుకున్నవారు తప్పనిసరిగా వ్యాక్సినేషన్ కేంద్రంలో అరగంట విశ్రాంతి తీసుకోవాలని కోరారు. వ్యాక్సినేషన్ తీసుకొని కోవిడ్ ఫ్రీ జిల్లాగా మార్చాలని కలెక్టర్ ప్రజలను కోరారు.

ఈ కార్యక్రమంలో మేయర్ వై. సునీల్ రావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, మున్సిపల్ ఇన్చార్జి కమిషనర్ గరిమ అగర్వాల్, డీఎంహెచ్ఓ డాక్టర్ జువేరియా, కార్పొరేటర్ పిట్టల వినోద, తదితరులు పాల్గొన్నారు.

సహాయ సంచాలకులు, జిల్లా పౌర సంబంధాల శాఖ కార్యాలయం, కరీంనగర్ వారిచే జారీ చేయడమైనది.

రాష్ట్రంలో ఇప్పటివరకు రెండు కోట్ల వ్యాక్సినేషన్ పూర్తి అయిన సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ మేయర్ సునీల్ రావుతో కలిసి కేక్ కట్ చేశారు.

సహాయ సంచాలకులు, జిల్లా పౌర సంబంధాల శాఖ కార్యాలయం, కరీంనగర్ వారిచే జారీ చేయడమైనది

.

Share This Post