DPRO KMNR తేది :17 -08 -2021 : ఫోటోలు & press note : దళిత బంధు లబ్ధిదారుల అవగాహన సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ పాల్గొన్న అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్, ట్రెని కలెక్టర్ మయాంక్ మిట్టల్ ( కరీంనగర్ జిల్లా )

పత్రికా ప్రకటన తేదీ :17-08 -2021
కరీంనగర్

ఆదాయం వచ్చే యూనిట్లను ఎంపిక చేసుకోండి

జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్
-000-
దళిత బంధు లబ్ధిదారులు తమ అనుభవం, వృత్తి నైపుణ్యత ఆధారంగా సంవత్సరం లోపు రెట్టింపు ఆదాయం వచ్చు యూనిట్లను ఎంపిక చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ లబ్ధిదారులకు సూచించారు.

మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలొ దళిత బంధు పథకం ప్రారంభ కార్యక్రమం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆర్థిక సహాయం పొందిన హుజరాబాద్ నియోజకవర్గం లోని 15 మంది లబ్ధిదారులకు జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన అవగాహన సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితబంధు పథకం క్రింద యూనిట్ల ఎంపికకు ఎలాంటి తొందర అవసరం లేదని, వారం రోజులు సమయం ఇస్తామని కలెక్టర్ తెలిపారు. లబ్ధిదారులు బ్యాంకులలో జీరో అక్కౌంట్ ఉన్న వారు కొత్తగా దళిత బంధు అక్కౌంట్ ను ఓపెన్ చేయాలని కలెక్టర్ సూచించారు. దళితబంధు క్రింద యూనిట్ స్థాపించుకొనుటకు కుటుంబ సభ్యులతో చర్చించి ఆలోచించుకొని మంచి ఆదాయం వచ్చే యూనిట్లను ఎంపిక చేసుకోవాలని కలెక్టర్ అన్నారు. లబ్ధిదారులు యూనిట్ల ఎంపికకు జిల్లా అధికారులతో పూర్తి అవగాహన పెంపొందిస్తామని తెలిపారు. లబ్ధిదారులు ఎంచుకున్న యూనిట్ల నిర్వాహణకు 10 – 15 రోజులు పూర్తి స్థాయిలో గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ద్వారా ఉచితంగా వృత్తి నైపుణ్యత శిక్షణ ఇప్పిస్తామని తెలిపారు. లబ్ధిదారులు ఆర్థికంగా అభివృద్ధి సాధించుటకు తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం సమకూర్చే మంచి యూనిట్లను ఎంపిక చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా అవగాహన సమావేశానికి హాజరైన 15 మంది లబ్దిదారులలో కొందరూ పాడి గేదెలు (డైయిరీ యూనిట్లు), గూడ్స్ ట్రేలర్, ట్రాక్టర్ ట్రేలర్, ఏర్టిగా కారు, సూపర్ బజార్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ, లేడీస్ ఎంపోరియం యూనిట్ లు ఎంపిక చేసుకున్నట్లు తెలిపారు. వాహనాలు ఎంపిక చేసుకున్న వారికి బుధవారం లర్నింగ్ లైసెన్సు జారీ చేయాలని డిప్యూటీ ట్రాన్స్ కమీషనర్ ను కలెక్టర్ ఆదేశించారు. డైయిరీ యూనిట్లను ఎంచుకున్న లబ్ధిదారులకు డైయిరీ నిర్వాహణ పై అవగాహన పెంపొందించుటకు కరీంనగర్ డైయిరీ కి లబ్ధిదారులను తీసుకువెళ్లి పాడి గేదెల రకాలు డైయిరీ నిర్వాహణ, దాన, పాలు తీయడం, ఎలా మార్కెటింగ్ చేయాలనే విషయాల పై పూర్తి అవగాహన పెంపొందించాలని జిల్లా పశు సంవర్ధక శాఖాధికారిని ఆదేశించారు. డైయిరీ యూనిట్లు ఎంపిక చేసుకున్న వారికి 5 పాడి గేదెలు, షెడ్డు నిర్మాణం, ఇన్సూరెన్సు, ఒక సంవత్సరం దాన కు అగు మొత్తం ఖర్చుకు ప్రణాళీకలు తయారు చేసి సమర్పించాలని ఆదేశించారు. అలాగే మెడికల్ షాపు, మెడికల్ షాపు యూనిట్ ఎన్నుకున్న వారికి ఫార్మసిస్ట్ సర్టిఫికేట్ తో లైసెన్సు ఇప్పించాలని డ్రగ్ ఇన్స్ పెక్టర్ ను ఆదేశించారు. విత్తనాలు, ఎరువుల షాపు యూనిట్లను ఎంచుకున్న వారికి అవసరమైన లైసెన్సును ఇప్పించాలని వ్యవసాయాధికారిని ఆదేశించారు. కిరాణం షాపులు, టెంట్ హౌజ్ యూనిట్లు ఎంపిక చేసుకుంటే అనుకున్న స్థాయిలో ఆదాయం వచ్చే అవకాశాలు తక్కువని, ప్రతి గ్రామంలో ఎక్కువ కిరాణం, టెంట్ హౌజ్ షాపులు ఉన్నాయని తెలిపారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్, అసిస్టెంట్ కలెక్టర్ మయాంక్ మిట్టల్, జిల్లా పరిశ్రమల కెంద్రం జనరల్ మేనేజర్ నవీన్ కుమార్, డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమీషనర్ చంద్రశేఖర్, జిల్లా షేడ్యూల్డ్ కులాల సంక్షేమాధికారి నేతనియల్, జిల్లా పశుసంవర్ధక శాఖాధికారి డా.నరెందర్, ఎల్.డి.ఎం. లక్ష్మణ్, ఆర్సెటీ మేనేజర్ దత్తాత్రేయ, నాబార్డు ఏజియం అనంత్, 15 మంది దళిత బంధు లబ్ధిదారులు , తదితరులు పాల్గొన్నారు.

జారీ చేసిన వారు సహాయ సంచాలకులు, సమాచార పౌర సంబంధాల శాఖ కరీంనగర్

Share This Post