DPRO KMNR తేది :18 -08 -2021 : ఫోటోలు & press note : ధరణి,పల్లె ప్రకృతి వనం,బృహత్ ప్రకృతి వనం,వైకుంఠ ధామం పై సంబంధిత అధికారులు మరియు తహసీల్దార్లల తో సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ ఆర్. వి. కర్ణన్ పాల్గొన్న అదనపు కలెక్టర్లు గరిమ అగర్వాల్, శ్యామ్ ప్రసాద్ లాల్, ట్రెని కలెక్టర్ మయాంక్ మిట్టల్ ( కరీంనగర్ జిల్లా )

పత్రికా ప్రకటన 18.8. 2021
కరీంనగర్

ధరణి పెండింగ్ కేసులను వారం రోజుల్లోగా పరిష్కరించాలి

ల్యాండ్ పూలింగ్ కోసం స్థలాలు సేకరించాలి

 

జిల్లా కలెక్టర్ ఆర్. వి. కర్ణన్

00000

జిల్లాలో పెండింగ్ లో ఉన్న ధరణి కేసులను వారం రోజుల్లోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆర్. వి. కర్ణన్ తహసీల్దార్లనుఅదేశించారు.

బుధవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో డి ఆర్ డి ఓ, పంచాయతీ రాజ్, ఆర్డిఓ, తాహసిల్దార్ లతో ధరణి ,వైకుంఠ ధామాలు, పల్లె ప్రకృతి వనం, బృహత్ ప్రకృతి వనాలు, ల్యాండ్ పూలింగ్ తదితర అంశాల పై మండలాల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ధరణి పోర్టల్ లో కేసులు పెండింగ్ లో ఉండకూడదని పెండింగ్ కేసులను వారం రోజుల్లోగా పూర్తి చేయాలని తహసీల్దార్లను ఆదేశించారు. ప్లాంటేషన్ కోసం స్థలాల ఎంపిక వేగవంతంగా పూర్తిచేయాలని అన్నారు. స్థలాల ఎంపిక కోసం మ్యాపింగ్ చేయాలని తెలిపారు. నేలలను బట్టి అందులో పెరిగే మొక్కలను నాటాలని అన్నారు. స్థలం అందుబాటులో లేని దగ్గర శిఖం భూములను గుర్తించి ఈత, తుమ్మ మొక్కలు నాటాలని తెలిపారు. జిల్లాలో వైకుంఠథామాలు 14 పెండింగ్ లో ఉన్నాయని స్థలాలను గుర్తించి వాటిని త్వరగా పూర్తి చేయాలన్నారు. ల్యాండ్
పూలింగ్ కోసం ప్రధాన రహదారులకు సమీపంలో పట్టాదారు రైతుల నుంచి భూమిని సేకరించాలని తెలిపారు గ్రామాల్లో బృహత్ ప్రకృతి వనాలు కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు రెవెన్యూ డివిజన్ అధికారులు ప్రతిరోజు తహసిల్దార్ లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ప్రగతి పనులను సమీక్షించాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్ శ్యామ్ ప్రసాద్ లాల్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీలత జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య, అసిస్టెంట్ డైరెక్టర్ ల్యాండ్ సర్వే అశోక్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పంచాయతీరాజ్ శ్రీనివాస రావు, ఆడియోలు ఆర్ డి వో లు ఆనంద్ కుమార్ రవీందర్ రెడ్డి, tpo శ్రీహరి, తహసీల్దార్లు తా తదితరులు పాల్గొన్నారు.

సహాయ సంచాలకులు, జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం కరీంనగర్ చే జారీ చేయడమైనది

Share This Post