DPRO KMNR తేది :19 -08 -2021 : ఫోటోలు & press note : జిల్లా పరిషత్ చైర్మన్ కనుమల్ల విజయ అధ్యక్షతన జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి లో నిర్వహించిన అసుపత్రి సలహ కమిటి సమావేశంలో మాట్లాడుతున్న రాష్ట్ర పౌర సరఫరాలు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఆర్. వి. కర్ణన్, నగర మేయర్ వై సునీల్ రావు ( కరీంనగర్ జిల్లా )

పత్రికా ప్రకటన తేదీ 19 8 2021
కరీంనగర్

నిరుపేదలకు అండగా టిఆర్ఎస్ ప్రభుత్వం

జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి లో సిటీ స్కాన్ సేవలు ప్రారంభం

రాష్ట్ర బీసీ సంక్షేమం పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్
00000

తెలంగాణ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, నిరుపేదలకు అండగా నిలుస్తుందని రాష్ట్ర బీసీ, సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.

కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో 2 కోట్ల 15 లక్షల తో ఏర్పాటు చేసిన అత్యాధునిక సిటీ స్కానర్ యంత్రాన్ని, గురువారం ఆయన ప్రారంభించారు. అనంతరం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి లో జిల్లా పరిషత్ చైర్పర్సన్ కనుమల్ల విజయ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా ఆసుపత్రి అభివృద్ధి సలహా కమిటీ సమావేశంలో మంత్రి పాల్గొని ఆసుపత్రి అభివృద్ధి పనుల పై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిరుపేద ప్రజలకు ఉచితంగా నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. సిటి స్కానింగ్ మిషన్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు పనిచేస్తుందని పేర్కొన్నారు.వచ్చే నెల సెప్టెంబర్ 1 నుంచి ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు రెండు షిఫ్ట్ లలో సిటి స్కాన్ సేవలను అందించ -నున్నట్లు మంత్రి తెలిపారు. ఇందుకోసం ఒక రేడియాలజిస్ట్ ను, ఒక టెక్నీషియన్, ఒక అటెండర్ ను అదనంగా నియమించి రెండు షిఫ్ట్ లలో పని చేసేలా చూడాలని ఆస్పత్రి వైద్యాధికారులను మంత్రి ఆదేశించారు. తెలుపు రేషన్ కార్డు కలిగిన రోగులకు ఉచితంగా సిటి స్కాన్ పరీక్షలు నిర్వహిస్తారని, తెలుపు రేషన్ కార్డు లేని రోగులకు రూ. 500/-మాత్రమే ఛార్జి లు తీసుకొని స్కానింగ్ పరీక్షలు చేస్తారని మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కెసిఆర్ కిట్ లనుఇప్పటివరకు 29975 మందికి అందజేశామని తెలిపారు. 2017 వ సంవత్సరం నుంచి ఇప్పటివరకు 34 వేల ప్రసవాలు జరుగగా, ఇందులో 10,995సాధారణ ప్రసవాలు అని తెలిపారు. 23 వేల 600 శస్త్ర చికిత్సలు నిర్వహించి ప్రసవాలు చేశారని మంత్రి తెలిపారు. అమ్మాయి పుట్టిన 16262 మందికి 13000/ మగ శిశువు జన్మించిన 13725 మందుకి 12000 చొప్పున అందజేశామన్నారు. ఇందుకోసం ప్రభుత్వం పది కోట్లు ఖర్చు చేసింది అన్నారు. జిల్లాలో సాధారణ ప్రసవాలు జరిగేలా ప్రోత్సహిస్తున్నాము అన్నారు.ప్రభుత్వ ఆసుపత్రులలో సాధారణ ప్రసవాలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు.రక్త నమూనా నిర్వహించేందుకు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి లో ఆధునిక లాబరేటరీ లను ఏర్పాటు చేసి ఇప్పటివరకు 56642 మందికి సంబంధించిన 56 రకాల 256940 రక్త పరీక్షలు నిర్వహించామని మంత్రి తెలిపారు. దేశంలో మొదటి దశ కోవిడ్ ను జిల్లాలో సమర్థవంతంగా అడ్డుకున్నామని అన్నారు. దేశంలోనే కరీంనగర్ జిల్లాలో తొలిదశలో 10 మందికి కోవిడ్ సోకగా పేషెంట్లకు నాణ్యమైన వైద్య సేవలు అందించి ఆరోగ్యాన్ని బాగు చేశామన్నూరు. ప్రస్తుతము జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో 79 మంది కోవిడ్ రోగులు చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. ఇందులో మంది కి వెంటిలేటర్ చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. మూడవ దశ కోవిడ్ ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు మంత్రి పేర్కొన్నారు. వర్షాకాలం పాతనీరు వెళ్లి కొత్త నీరు వచ్చినందున అంటు వ్యాధులు, డెంగ్యూ జ్వరాలు సోకకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యాధికారులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. ఈ సమావేశంలో జెడ్పి చైర్ పర్సన్ కనుమల్ల విజయ, జిల్లా కలెక్టర్ ఆర్ వి. కర్ణను, మేయర్ వై. సునీల్ రావు, జెడ్ పి టి సి పిట్టల కరుణ, ఎంపీపీ రాణి, ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రత్నమాల, ఆర్ ఎం వో డాక్టర్ జ్యోతి, రేడియాలజిస్ట్ డాక్టర్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

సహాయ సంచాలకులు, జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం కరీంనగర్ జారీ చేయడమైనది

Share This Post