DPRO KMNR తేది : 20-07-2021 : ఫోటోలు & ప్రెస్ నోట్ : బాల రక్ష భవన బిల్డింగ్ ను ప్రారంభించిన రాష్ట్ర BCW&CS మంత్రివర్యులు గంగుల కమలాకర్ పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్. (కరీంనగర్ జిల్లా).

పత్రికా ప్రకటన

తేదీ 20-07- 2021

కరీంనగర్

బాలల పరిరక్షణ కె బాల రక్షక భవన్.

రాష్ట్ర పౌర సరఫరాలు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్
O0o

బాలల పరిరక్షణకై అందించే అన్ని సేవలు ఒకే చోట లభించుట కె బాల రక్షక భవన్ ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర పౌర సరఫరాల, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు .మంగళవారం బాల రక్షక భవన్ ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బాలల పరిరక్షణ కై అందించే అన్ని సేవలు ఒకే గొడుగు కిందకు తేవాలనే ఉద్దేశంతో బాల రక్షక భవన్ ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు .తెలిసీ తెలియని వయసులో చేసిన తప్పులను సరిదిద్ది వారు పెద్దయ్యాక సక్రమ జీవనము కొనసాగేలా చేయుటకు బాల రక్షక భవన్ ఎంతో తోడ్పడుతుందని అన్నారు .బాల రక్షక భవన్ లో బాలబాలికలకు న్యాయ సహాయం అందుతుందని తెలిపారు .రక్షణ లేని పిల్లలకు రక్షణ కల్పించబడుతుంది అన్నారు .

 

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్ .వి కర్ణన్, నగరపాలక సంస్థ మేయర్ వై సునీల్ రావు, ఎస్సి. పి సి ఆర్ మెంబర్ శోభారాణి , డి ఎల్ ఎస్ ఎ సుజయ్, సీడబ్ల్యూసీ చైర్పర్సన్ ధనలక్ష్మి, జిల్లా సంక్షేమ అధికారి శారద, కోఆర్డినేటర్ సరస్వతి, ఏ. సి.పి మదన్ లాల్, కార్పొరేటర్ గుగ్గిళ్ల జయశ్రీ తదితరులు పాల్గొన్నారు.

 

జారీ చేసిన వారు సహాయ సంచాలకులు సమాచార పౌర సంబంధాల శాఖ కరీంనగర్

Share This Post