పత్రికా ప్రకటన
తేదీ 20-07 -2021
కరీంనగర్
జిల్లా కలెక్టర్ గా ఆర్.వి. కర్ణన్ బాధ్యతలు స్వీకరణ.
కరీంనగర్ జిల్లా కలెక్టర్ గా ఆర్.వి. కర్ణన్ మంగళవారం కలెక్టరేట్ లోనీ కలెక్టర్ చాంబర్లో బాధ్యతలు స్వీకరించారు .ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ కు అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ ,నగర పాలక సంస్థ కమిషనర్ వల్లూరి క్రాంతి, లోకల్ బాడీస్ అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్, ట్రైని కలెక్టర్ మయాంక్ మిట్టల్, పూల మొక్కల బొకేలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు . అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం అయ్యారు ఈ సందర్భంగా జిల్లా అధికారులు కలెక్టర్ తో పరిచయ కార్యక్రమం జరిగింది . అనంతరము జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి డి.కొమురయ్య కరీంనగర్ జిల్లా భౌగోళిక విస్తీర్ణము, మండలాలు, గ్రామాలు, జిల్లా జనాభా, వర్షపాతం మొదలగు వివరాలను తెలిపారు. జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ జిల్లాలో సాగు విస్తీర్ణం , వరి మొక్కజొన్న ,పత్తి సాగు, పంటల దిగుబడి మొదలైన వివరాలను కలెక్టర్ కు వివరించారు. జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య పల్లె ప్రగతి పనుల వివరాలు, వైకుంఠ దామల నిర్మాణాలు, పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు గురించి వివరించారు, ఈ సందర్భంగా జిల్లాలో 13 వైకుంఠ ధామాల నిర్మాణాలు పెండింగ్ లో ఉన్నాయని తెలపగా వెంటనే ఒక్కొక్క వైకుంఠ దామం నిర్మాణానికి ఒక పంచాయతీ రాజ్ డిప్యూటీ ఇంజనీర్ కు భాద్యతలను అప్పగించి నెలాఖరులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమం గురించి జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీలత కలెక్టర్ కు వివరించారు. జిల్లాలో హరితహారం కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో కరుణ పరిస్థితుల గురించి తీసుకున్న చర్యల గురించి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ జువేరియా కలెక్టర్ కు కు వివరించారు. జిల్లాలో ఆశావర్కర్లు ,ఏఎన్ఎంలు, పంచాయతీ సెక్రెటరీ లతో టీమ్లను ఏర్పాటు చేసి జ్వర సర్వేను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. కోవిడ్ లక్షణాలు ఉన్న వారిని ముందుగానే గుర్తించి తగిన చికిత్స అందించి కరోనాను నియంత్రించాలని అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇంత వరకు జిల్లా కలెక్టర్ కె. శశాంక ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా చాలా అభివృద్ధి చెందిందని అన్నారు . జిల్లా అభివృద్ధికి అధికారులందరూ కలెక్టర్ కు సహకరించారని, అదే స్ఫూర్తితో జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించుటకు అధికారు లందరూ తమ సహకారాన్ని కొనసాగించాలని అన్నారు . ఈ సమావేశంలో జిల్లా అధికారులందరూ పాల్గొన్నారు.అనంతరం జిల్లా అధికారులు కలెక్టర్ కు పూల మొక్కలు, బొకేలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.
జారీ చేసిన వారు సహాయ సంచాలకులు సమాచార పౌర సంబంధాల శాఖ కరీంనగర్
