DPRO KMNR తేది 20.08.2021: ఫోటోలు & ప్రెస్ నోట్: శాతవాహన యూనివర్సిటీ ఆవరణలో మొక్కలు నాటి నీళ్లు పోస్తున్న జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్, పాల్గొన్న వైస్ చాన్సిలర్ ఎస్. మల్లేశం, కమీషనర్ వల్లూరి క్రాంతి.

పత్రిక ప్రకటన తేది 20.08.21

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి

మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి

జిల్లా కలెక్టర్ ఆర్. వి.కర్ణన్
0000

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు జిల్లాలో విరివిగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి అని జిల్లా కలెక్టర్ ఆర్. వి.కర్ణన్ అన్నారు.

శుక్రవారం శాతవాహన యూనివర్సిటీ ఆవరణలో యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ఎస్.మల్లేశం, మున్సిపల్ కమిషనర్ వల్లూరి క్రాంతి తో కలిసి ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శాతవాహన యూనివర్సిటీ సుమారు 200 ఎకరాలు విస్తీర్ణంలో ఉందని, ఇప్పటికే చెట్లతో పచ్చదనం వెల్లి విరుస్తుందని తెలిపారు. ఖాళీ ప్రదేశం గుర్తించి మరిన్ని మొక్కలు నాటడం వల్ల యూనివర్సిటీ పచ్చదనంతో మరింత అందంగా కనబడుతుందని అన్నారు. పచ్చదనంతో పాటు పరిశుభ్రత కూడా పాటించాలన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తెలంగాణ హరితహారంలో భాగంగా జిల్లాలో ప్రజలు తమ ఇండ్లలలో, వీధుల్లో విరివిగా మొక్కలు నాటి పచ్చదనం పెంపొందించాలని అన్నారు

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వల్లూరి క్రాంతి, శాతవాహన యూనివర్సిటీ ఉపకులపతి ఎస్. మల్లేశం, రిజిస్ట్రార్ టి. భరత్, కార్పొరేటర్ కోల భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

సహాయ సంచాలకులు, జిల్లా పౌర సంబంధాల శాఖ కరీంనగర్ కార్యాలయం చే జారీ చేయడమైనది.

Share This Post