DPRO KMNR తేది : 22-07-2021 : ప్రెస్ నోట్ : మానేరు డ్యామ్ గేట్లను ఎత్తున్న రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మరియు సివిల్ సప్లై మంత్రివర్యులు గంగుల కమలాకర్ పాల్గొన్న ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, నగర మేయర్ సునీల్ రావు, అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్. (కరీంనగర్ జిల్లా).

పత్రిక ప్రకటన

తేదీ 22-07 -2021

కరీంనగర్

జూలైలో ఎల్ .ఎం. డి గేట్లు ఎత్తి నీటిని విడుదల మొదటి సారి.

రాష్ట్ర పౌర సరఫరాలు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్.
O0o

 

జూలై మాసంలో లోయర్ మానేర్ డ్యాం గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయుట ఇది మొదటిసారి అని రాష్ట్ర పౌరసరఫరాలు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.

గురువారం సాయంత్రం మంత్రి ఎల్ఎండి 12 గేట్లను ఎత్తి 60 వేల క్యూసెక్కుల నీటిని క్రిందకు విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇదివరకెప్పుడూ జూలై మాసంలో ఎల్ ఎం డి గేట్లను ఎత్తి నీటి విడుదల చేయలేదని , ఇదే మొదటిసారి అని మంత్రి తెలిపారు. గత సంవత్సరము ఎల్ఎండి గేట్లను ఆగస్టు మాసంలో ఎత్తి నీటిని విడుదల చేశామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో జిల్లాలో సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయి అని ,అన్ని ప్రాజెక్టు లు, చెరువులు నీటితో నిండి జలకళ సంతరించుకున్నాయని తెలిపారు . ఎల్ఎండి ఎగువ ప్రాంతాల నుండి లక్షా 30 వేల క్యూసెక్కుల నీరు వస్తుందని ,మోయ తుమ్మెద వాగు నుండి 25 వేల క్యూసెక్కులు, మద్య మానేరు ప్రాజెక్టు నుండి 1.5 లక్షల క్యూసెక్కుల నీరు పై నుండి ఎల్ఎండి లోకి వస్తుందని తెలిపారు. ప్రస్తుతము ఎల్ ఎం డి లో 22 టిఎంసిల నీరు దాటిందని ,ఎల్ఎండి నీటి సామర్థ్యం 24 టీఎంసీ లని ఆయన తెలిపారు. ప్రస్తుతము పన్నెండు గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నామని తెలిపారు. ఎగువ నుండి నుండి ఇన్ ఫ్లో ఎక్కువ ఉంటే మరో రెండు మూడు గేట్లు తెరుస్తా మని మంత్రి తెలిపారు .అధికారులు ప్రతి నిమిషము అప్రమత్తంగా ఉండి నీటిని పరిశీలిస్తారని, ఎల్ఎండి లో ఎప్పుడూ 23 టీఎంసీలు నీరు ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటారని తెలిపారు .కాళేశ్వరం ప్రాజెక్టు జలాల వల్ల భూగర్భ జల మట్టం పెరిగిందని మంత్రి తెలిపారు .ప్రతి వర్షపు బొట్టు నీటి సంపద అని అన్నారు.

ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు నారదాసు లక్ష్మణరావు నగర మేయర్ వై సునీల్ రావు, అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్, కార్పొరేటర్లు, ఎస్సారెస్పీ ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు .

జారీ చేసిన వారు సహాయ సంచాలకులు, సమాచార పౌర సంబంధాల శాఖ కరీంనగర్

Share This Post