DPRO KMNR తేది : 22-07-2021 : ఫోటోలు & ప్రెస్ నోట్ : హుజరాబాద్ మండల ఎం.ఎల్.ఎ క్యాంప్ కార్యాలయంలో వృద్ధాప్య పింఛన్లు మరియు గొర్రెల పంపిణీ కార్యక్రమం పై ఎంపీడీవో లతో సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ (కరీంనగర్ జిల్లా).

పత్రికా ప్రకటన

తేదీ 22-07- 2021
హుజురాబాద్

అర్హులైన పింఛన్ లబ్ధిదారుల జాబితా సిద్ధం చేయాలి.

జిల్లా కలెక్టర్ ఆర్. వి. కర్ణన్

హుజురాబాద్ డివిజన్ పరిధిలో 57 సంవత్సరములు దాటి వృద్ధాప్య పింఛను కు అర్హులైన లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్. వి కర్ణన్ అన్నారు.
గురువారం హుజరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హుజురాబాద్ డివిజన్ పరిధిలోని మండల అభివృద్ధి అధికారులు, మున్సిపల్ కమిషనర్లతో వృద్ధాప్య పింఛన్ లబ్ధిదారుల ఎంపిక, వ్యాక్సినేషన్, గొర్రెల కోసం డిడి లు కట్టని వారి వివరాలు తదితర లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 57 సంవత్సరములు నిండిన వారికి వృద్ధాప్య పింఛన్లు మంజూరు చేయుటకు ఉత్తర్వులు జారీ చేసింది అని తెలిపారు. వృద్ధాప్య పింఛన్ల మంజూరుకు అర్హులైన లబ్ధిదారులను గుర్తించాలని కలెక్టర్ ఎంపిడిఓ లను, మున్సిపల్ కమిషనర్లను కలెక్టర్ ఆదేశించారు. అలాగే ఆసరా పింఛన్లు పొందుతున్న వారిలో చనిపోయిన వారిని గుర్తించి జాబితా నుండి తొలగించాలని కలెక్టర్ ఆదేశించారు. ఇంతవరకు 57 సంవత్సరా లు నిండి వృద్ధాప్య పింఛన్ల కు అర్హులైన వారి నుండి దరఖాస్తులు స్వీకరించి లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేయాలని కలెక్టర్ ఎంపీడీవో లను మున్సిపల్ కమిషనర్లను కలెక్టర్ ఆదేశించారు. హుజురాబాద్ డివిజన్ లో 18 సంవత్సరములు నిండిన వారందరికీ కోవిడ్ వ్యాక్సిన్ వేయించాలని కలెక్టర్ సూచించారు .ఇంత వరకు 18 సంవత్సరములు నిండిన వారు ఎంతమంది కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు, ఇంకా ఎంత మందికి వ్యాక్సిన్ వేయాలి, గ్రామాల వారీగా, వార్డుల వారీగా జాబితాను తయారు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు .అలాగే 40 సంవత్సరాలు పైబడిన వారు ఎంతమంది ది ఫస్ట్ డోసు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు, రెండవ డోసు వ్యాక్సిన్ ఎంతమందికి ఇవ్వాలి జాబితాను సిద్ధం చేసి అందరికి టీకాలు వేయించాలని కలెక్టర్ ఆదేశించారు. హుజురాబాద్ డివిజన్ లో ఈనెల 28 రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని జమ్మికుంటలో ప్రారంభిస్తారని తెలిపారు. గొర్రెల యూనిట్లు పంపిణీకి ఇంకనూ డీడీలు చెల్లించ నీ వారి వివరాలను గ్రామాల వారీగా సేకరించి వెంటనే డీడీలు కట్టించాలని అన్నారు.

ఈ సమావేశంలో లోకల్ బాడీస్ అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్ ,ట్రైనీ కలెక్టర్ మయాంక్ మెటల్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీలత, ఆర్ డి ఓ రవీందర్ రెడ్డి, హుజురాబాద్, జమ్మికుంట మున్సిపల్ కమిషనర్లు ,ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు

జారీ చేసిన వారు సహాయ సంచాలకులు సమాచార పౌర సంబంధాల శాఖ కరీంనగర్

Share This Post