DPRO KMNR తేది : 22-07-2021 : ఫోటోలు & ప్రెస్ నోట్ : వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అధికారులతో సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మరియు సివిల్ సప్లై మంత్రివర్యుల గంగుల కమలాకర్ పాల్గొన్న ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్, నగర మేయర్ వై సునీల్ రావు, మున్సిపల్ కమిషనర్ వల్లూరి క్రాంతి, అదనపు కలెక్టర్లు గరిమ అగర్వాల్, శ్యామ్ ప్రసాద్ లాల్. (కరీంనగర్ జిల్లా).

పత్రికా ప్రకటన

తేదీ 22 -07- 2021

కరీంనగర్

భారీ వర్షాలు వరదలకు ఎలాంటి ప్రాణ ,ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టండి

రాష్ట్ర బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్.
O0000

జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు ,వరదలకు ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా సంబంధిత అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని రాష్ట్ర బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ, పోలీసు, పంచాయతీరాజ్ , ఇరిగేషన్ ఇంజనీర్లు, మున్సిపల్ అధికారులతో జిల్లాలో కురుస్తున్న వర్షాలు వరదలు వల్ల ప్రాణ నష్టం జరగకుండా చర్యల పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అధికారులందరూ రానున్న 3,4 రోజులు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని మంత్రి ఆదేశించారు .భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యి ఇల్లు కూలి ప్రాణ నష్టం జరిగే అవకాశాలు ఉన్నందున వర్షపు నీటిని బయటకు పంపించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. భారీ వర్షాలకు చెరువులు ,కుంటలు తెగిపోకుండా తగిన ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రోడ్లు ,కల్వర్టులు కొట్టుకుపోకుండా చూడాలని అన్నారు. భారీ వరదలకు ఎక్కడైనా రోడ్లు దెబ్బ తింటే వెంటనే ప్రజలకు ఇబ్బందులు కాకుండా తాత్కాలిక మరమ్మతులు చేయాలని ఆదేశించారు. భారీ వర్షాలకు అన్ని ప్రాజెక్టులు ,చెరువులు నీటితో నిండాయని మిడ్ మానేర్ డ్యాం, లోయర్ మానేర్ డ్యాం, ఎల్లంపల్లి నిండి నందున ఎల్ఎండి నుండి 12 గేట్లు ఎత్తి నీటిని కిందికి వదిలామని ,క్రింది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు .మున్సిపల్ అధికారులు మూడు షిఫ్టు లలో అధికారులకు విధులు కేటాయించి అత్యవసర సేవలు ప్రజలకు అందించాలని ఆదేశించారు.గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలని అన్నారు. వర్షాల వల్ల సీజనల్ వ్యాధులు ప్రబలకుండ గ్రామాల్లో సానిటేషన్,క్లోరినేషన్ చేపట్టాలని బ్లీచింగ్ పౌడర్ చల్లాలని మంత్రి ఆదేశించారు. మురుగునీటి కాలువలు లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలో నీరు వెళ్లకుండా డ్రైనేజీ శుభ్రం చేయించాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. ఎలక్ట్రిసిటీ, ఇరిగేషన్ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.జిల్లాలో 26 వ తేదీ నుండి కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్నందున తగు చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణ పనులను త్వరగా చేపట్టాలన్నారు.

నగర మేయర్ వై సునీల్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలోని అల్కాపురి కాలనీ ,సంతోష్ నగర్ కాలనీలో వర్షపు నీరు ఇండ్లలోకి వచ్చే అవకాశం ఉందని, డ్రైనేజీలు ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ వర్షపు నీటిని బయటకు పోయేలా చర్యలు తీసుకోవాలని సూచించారు .

 

ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్, శాసనమండలి సభ్యులు నారదాసు లక్ష్మణరావు, నగర మేయర్ వై సునీల్ రావు, అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్, లోకల్ బాడీస్ అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్, ట్రైనీ కలెక్టర్ మయాంక్ మిట్టల్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

 

జారీ చేసిన వారు సహాయ సంచాలకులు సమాచార పౌర సంబంధాల శాఖ కరీంనగర్

Share This Post