DPRO KMNR తేది : 23-08-2021 : ఫోటోలు & ప్రెస్ నోట్ : కొత్త పరిశ్రమల్లో స్థానికులకు ఉపాధి కలిపించుట పై సంభందిత అధికారులతో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్. (కరీంనగర్ జిల్లా).

పత్రికా ప్రకటన తేదీ 23-8-2021

కొత్తగా స్థాపించే పరిశ్రమల్లో స్థానికులకు ఉపాధి కల్పించాలి

జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్
00000

జిల్లాలో కొత్తగా స్థాపించే పరిశ్రమల్లో స్థానికులకు ఉపాధి కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆర్. వి. కర్ణన్ అధికారులను ఆదేశించారు.

సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కొత్త పరిశ్రమల్లో స్థానికులకు ఉపాధి అవకాశాలపై క్లస్టర్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో అయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కొత్తగా స్థాపించే పరిశ్రమల్లో స్థానికులకు ప్రాధాన్యం ఇచ్చేలా చూడాలని తెలిపారు. పరిశ్రమల్లో చేరే కార్మికులకు పిఎఫ్, ఇన్సూరెన్స్ పథకాలు అందేలా చూడాలన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు స్థానికులను తమ పరిశ్రమలు నిర్మించుకునేలా అధికారులు వారికి అవగాహన కల్పించాలని తెలిపారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు జీవి శ్యాం ప్రసాద్ లాల్, గరిమ అగర్వాల్, అసిస్టెంట్ కలెక్టర్ మయాంక్ మిట్టల్, జడ్పీ సీఈఓ ప్రియాంక, జిల్లా పరిశ్రమల శాఖ జిఎం నవీన్ కుమార్,డి ఆర్ డి ఓ శ్రీలత వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

సహాయ సంచాలకులు, జిల్లా పౌర సంబంధాల శాఖ కరీంనగర్ కార్యాలయం చే జారీ చేయడమైనది.
———:

Share This Post