పత్రికా ప్రకటన తేదీ :23-08 -2021
కరీంనగర్
ఆగష్టు 25 నుండి 31 వరకు జాతీయ నూలి పురుగుల నిర్మూలన కార్యక్రమం
జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్
00000
జిల్లాలో ఆగష్టు 25 నుండి 31 వరకు జాతీయ నూలి పురుగుల నిర్మూలన కార్యక్రమం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ అన్నారు.
సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జాతీయ నూలి పురుగుల నిర్మూలన కార్యక్రమం పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 3,44,654 ల మంది 1 నుండి 18 సంవత్సరాల లోపు పిల్లలు ఉన్నారని, వారందరికి జాతీయ నూలి పురుగుల నిర్మూలన కార్యక్రమంలో అల్బెండజోల్ మాత్రలు వేయాలని ఆదేశించారు. 1 నుండి 2 సంవత్సరాల లోపు పిల్లలకు సగం మాత్రను, 2 నుండి 19 సంవత్సరాల లోపు పిల్లలందరికి ఒక మాత్ర పూర్తిగా వేయించాలని అన్నారు. జిల్లాలోని ఏ.ఎన్.ఎం.లు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు ఇంటింటికి వెళ్లి 19 సంవత్సరాల లోపు పిల్లలందరికి అల్బెండజోల్ మాత్రలను వంద శాతం వేయాలని అన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ప్రాథమిక ఆరోగ్య కెంద్రానికి ఒకరి చొప్పున అంగన్వాడీ సూపర్వైజర్లు, సి.డి.పి.వో. లు పర్యవేక్షణాధికారులుగా విధులు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయుటకు మెప్మా సిబ్బంది కూడా భాగస్వామ్యులు కావాలని సూచించారు.
జిల్లా వైద్యా ఆరోగ్య శాఖాధికారిని డా. జువేరియా మాట్లాడుతూ జాతీయ నూలి పురుగుల నిర్మూలన కార్యక్రమంలో కొవిడ్ -19 నిబంధనలను పాటిస్తూ అల్బెండజోల్ మాత్రలను 19 సంవత్సరాల లోపు పిల్లలందరికి వేయాలని సూచించారు. 1 నుండి 2 సంవత్సరాల లోపు పిల్లలందరికి సగము మాత్రను నీటితో కలిపి ఇవ్వాలని అన్నారు. 2 నుండి 19 సంవత్సరాలలోపు పిల్లలకు ఒక మాత్ర చొప్పున వేసి పూర్తిగా నమలమని చెప్పాలని, మాత్రలను ఇచ్చే సమయంలో త్రాగు నీటిని అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. మాత్రలను ఇంటి బయటనే ఉండి పిల్లలకు వేయించాలని అన్నారు. మాత్రలు వేయు సమయంలో వారి ఇంటిలో ఎవరికైనా కోవిడ్ లక్షణాలు ఉన్నవ అనే విషయాన్ని కనుక్కోవాలని, ఎవరికైనా దగ్గు, జ్వరము, శ్వాస తీసుకొవడంలో ఇబ్బంది లాంటి కోవిడ్ లక్షణాలు ఉన్న పిల్లలకు మాత్రలు వేయవద్దని తెలిపారు. ఈ లక్షణాలు ఉన్న పిల్లల వివరాలను సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కెంద్రాల వైద్యాధికారులకు తెలపాలని అన్నారు.
ఈ సమావేశంలో నగరపాలక సంస్థ కమీషనర్ వల్లూరి క్రాంతి, అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్, జిల్లా పరిషత్ సి.ఈ.వో. ప్రియాంక, డి.ఆర్.డి.వో. శ్రీలత, జిల్లా సంక్షేమాధికారి రవీందర్, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
సహాయ సంచాలకులు, జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం కరీంనగర్ చేజారీచేయనైనది
