పత్రికా ప్రకటన
తేదీ 23-08 -2021
కరీంనగర్
దళిత బంధులో లబ్ధిదారులు ఎంపిక చేసుకున్న యూనిట్లు మంజూరు
జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్
00000
దళిత బంధు పథకంలో లబ్దిదారులు ఎంపిక చేసుకున్న యూనిట్లను వెంటనే మంజూరు చేస్తామని జిల్లా కలెక్టర్ ఆర్. వి.కర్ణన్ అన్నారు.
సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులు, బ్యాంకర్లు, ఇన్సూరెన్స్ అధికారులు ,ఆర్టీవో, ఎంపీడీవోల సమక్షంలో దళిత బందు లబ్ధిదారులు ఎంపిక చేసుకున్న యూనిట్ల గ్రౌండింగ్ పై సమీక్ష సమావేశం నిర్వహించారు . ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ నెల 16న హుజురాబాద్ లో దళిత బంధు పథకం ప్రారంభం సందర్భంగా 15 మంది లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేశారని తెలిపారు . ఆ 15 మంది లబ్ధిదారులు ఎంచుకున్న యూనిట్లను వెంటనే గ్రౌండింగ్ చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు . 15 మంది లబ్ధిదారులు వారికి మంజూరు చేసిన యూనిట్లను గ్రౌండింగ్ కు ఒప్పుకున్నారని కలెక్టర్ తెలిపారు . టాక్సీ కొరకు కార్లను ఎంచుకున్న యూనిట్ లబ్ధిదారులకు వెంటనే లైసెన్సులు మంజూరు చేసి , సంబంధిత షోరూమ్ యజమానులతో మాట్లాడి వాహనాలను ఇప్పించాలని జిల్లా రవాణా అధికారి ని కలెక్టర్ ఆదేశించారు. వాహనాలకు ఇన్సూరెన్స్ చేయించాలని ఇన్సూరెన్స్ కంపెనీల అధికారులను సూచించారు. డైరీ యూనిట్ ఎంపిక చేసుకున్న లబ్ధిదారులకు వెంటనే కరీంనగర్ డైరీ, విజయ డైరీ వారి సహకారంతో షెడ్డు లు నిర్మించి, గేదెలను ఇప్పించాలని కరీంనగర్ విజయ డైరీ అధికారుల ను కలెక్టర్ ఆదేశించారు . అన్ని యూనిట్లకు ఇన్సూరెన్స్ తప్పకుండా చేయించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మినీ సూపర్ బజార్ యూనిట్స్ ఎంపిక చేసుకున్న వారికి అనుకూలంగా షాపు లను పరిశీలించి వారికి అవసరమైన సామాన్లను ఇప్పించాలని అధికారులకు సూచించారు .టైలరింగ్, ఎంబ్రాయిడరీ ,లేడీస్ ఎంపోరియం యూనిట్ ఎంపిక చేసుకున్న వారికి వెంటనే తగిన శిక్షణ ఇప్పించి యూనిట్లను గ్రౌండింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు . అలాగే ట్రాక్టర్ యూనిట్ ఎంచుకున్న లబ్ధిదారులకు సంబంధిత డ్రైవింగ్ లైసెన్స్ వెంటనే ఇప్పించి, ట్రాక్టర్, ట్రేలర్ కొనుగోలు చేసి ఇవ్వాలని ఆర్డీవోను ఆదేశించారు. సిమెంట్ , ఐరన్ దుకాణం యూనిట్ ఎంపిక చేసుకున్న వారికి వెంటనే షాప్ ఏర్పాటు చేసుకొనుటకు మంచి స్థలం గుర్తించి యూనిట్ గ్రౌండింగ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు . ఐదు రోజుల్లో గా హుజూరాబాద్ నియోజకవర్గం లోని దళిత కుటుంబాల అందరికీ కొత్త తెలంగాణ దళిత బందు అకౌంట్ ప్రారంభించాలని బ్యాంకర్ల ను కలెక్టర్ ఆదేశించారు
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్, జిల్లా పరిషత్ సీఈవో ప్రియాంక, అసిస్టెంట్ కలెక్టర్ మయాంక్ మిట్టల్ , ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సురేష్, ఆర్టీవో చంద్రశేఖర్ , జిల్లా షెడ్యూల్ కులాల సంక్షేమ అధికారి నీతిని, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ నవీన్ కుమార్ ,15 మంది దళిత బంధు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
సహాయ సంచాలకులు, జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం కరీంనగర్ చే జారీ చేయడమైనది