DPRO KMNR తేది : 24-08-2021 : ఫోటోలు & ప్రెస్ నోట్ : తెలంగాణ దళిత బంధు లబ్దిదారులకు, బ్యాంకు ఖాతాల పై జరిగిన సమావేశంలో బ్యాంకు అధికారులతో మాట్లాడుతున్నజిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్. (కరీంనగర్ జిల్లా).

పత్రికా ప్రకటన తేదీ:24-8-2021

దళిత బంధు ఖాతాలు తెరిచేందుకు బ్యాంకులు సిద్ధం

– జిల్లా కలెక్టర్ ఆర్. వి.కర్ణన్

తెలంగాణ దళిత బంధు బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు అన్ని బ్యాంకులు సిద్ధం : బ్యాంకర్స్

000000

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళితుల అభ్యున్నతి కోసం ప్రతిష్టాత్మకంగా హుజూరాబాద్ నియోజకవర్గలో చేపట్టిన తెలంగాణ దళిత బంధు పైలట్ ప్రాజెక్ట్ పథకం కు సంబంధించి బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు అన్ని బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయని జిల్లా కలెక్టర్ ఆర్. వి కర్ణన్ అన్నారు

మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయ సమావేశ మందిరంలో బ్యాంకర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హుజురాబాద్ నియోజక వర్గంలోని ఏడు మండలాల్లో బ్యాంకర్లు దళితవాడల్లోని ప్రతి ఇంటికి వెళ్లి దళిత కుటుంబాలకు తెలంగాణ దళిత బంధు బ్యాంక్ అకౌంట్ తెరవాలని సూచించారు. హుజరాబాద్ నియోజకవర్గం లోని హుజురాబాద్, హుజురాబాద్ రూరల్, జమ్మికుంట, జమ్మికుంట రూరల్, కమలాపూర్, వీణవంక, ఇల్లందకుంటలోనీ దళిత వాడల్లో బ్యాంకు సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి తెలంగాణ దళిత బందు ఖాతాలు తెరువాలని కలెక్టర్ బ్యాంకర్లను కోరారు. సమావేశం లో పాల్గొన్న అన్ని బ్యాంకులు తెలంగాణ దళిత బందు ఖాతాలు తెరిచేందుకు సిద్ధంగా ఉన్నామని కలెక్టర్ తెలిపారు.

ఈ సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ మయాంక్ మిట్టల్, జిల్లా పరిషత్ సిఈవో ప్రియాంక, లీడ్ బ్యాంక్ మేనేజర్ లక్ష్మణ్, నాబార్డ్ డీడీఎం అనంత్,ఎస్సీ కార్పొరేషన్ ఈడి సురేష్, అన్ని బ్యాంకుల బ్యాంక్ కంట్రోలర్స్ తదితరులుపాల్గొన్నారు.

సహాయ సంచాలకులు, జిల్లా పౌర సంబంధాల శాఖ కార్యాలయం కరీంనగర్ చే జారీ చేయడమైనది.

Share This Post