DPRO KMNR తేది: 25-08-2021 : press note : దళిత బంధు సర్వే పై ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతున్న CMO కార్యదర్శి రాహుల్ బొజ్జ పాల్గొన్న కలెక్టర్లు ఆర్ వి కర్ణన్, రాజీవ్ గాంధీ హనుమంతు. (కరీంనగర్ జిల్లా ).

పత్రికా ప్రకటన తేదీ: 25-8-2021

దళిత బంధు దళితులు అందరికీ అమలు

ఈ నెల 27 నుండి సెప్టెంబర్ 2 వరకు దళితవాడల్లో ఇంటింట సర్వే

సాచులేషన్ మోడ్ లో దళిత బంధు అమలు

మిషన్ మోడ్ లో అన్ని కుటుంబాలకు తెలంగాణ దళిత బంధు బ్యాంక్ అకౌంట్ ను ప్రారంభిస్తాం

రైతుబంధు లాగానే దళిత బంధు అమలు చేస్తాం

– సి.ఎం.వో. కార్యదర్శి రాహుల్ బొజ్జ
00000

దళిత బందును దళితులు అందరికీ సాచులేషన్ మోడ్ లో అమలు చేస్తామని ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి రాహుల్ బొజ్జా అన్నారు.

బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్,హనుమకొండ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హుజరాబాద్ నియోజకవర్గం లోని ప్రతి దళిత కుటుంబాన్ని ఈనెల 27వ తేదీ నుండి సెప్టెంబర్ 2 వరకు అధికారులతో కూడిన బృందాలు దళితవాడల్లోని ప్రతి ఇంటికి వెళ్ళి వివరాలు సేకరిస్తాయని అన్నారు. సాచులేషన్ మోడ్ లో దళిత కుటుంబాల అన్నింటికీ దళిత బంధు అమలు చేస్తామని అయన తెలిపారు. ఎవరు కూడా అపోహ పడవద్దని దళిత బంధు పూర్తిస్థాయిలో దళితులు అందరికీ అమలు చేస్తామన్నారు. ఆధార్ కార్డ్ ఇతర వివరాలను అందించాలని దళిత కుటుంబాలను ఆయన కోరారు. రైతుబంధు పథకంలో రైతులందరికీ అమలు చేసినట్లే దళిత బందులో దళితులు అందరికీ అమలు చేస్తాం.

జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ మాట్లాడుతూ హుజూరాబాద్ నియోజకవర్గం లోని ఐదు మండలాలు, రెండు మున్సిపాలిటీలలో ఈనెల 27 నుంచి దళితుల ఇంటింటికి వెళ్లి అధికారుల బృందాలు సమగ్ర సర్వే చేపడతారనీ తెలిపారు. ప్రతిరోజు 150 ఇండ్లను సర్వే చేస్తారని, ఈ ప్రక్రియ వచ్చేనెల సెప్టెంబర్2 వరకు కొనసాగుతుందని తెలిపారు. సర్వే తో పాటు బ్యాంకర్లు దళిత కుటుంబాలకు సంబంధించి తెలంగాణ దళిత బంధు పేరు మీద కొత్త అకౌంట్లు ఓపెన్ చేస్తారని చెప్పారు. హుజురాబాద్, హుజురాబాద్ రూరల్, కమలాపూర్, జమ్మికుంట, వీణవంక, కమలాపూర్ రూరల్, ఇల్లందకుంటలలో బ్యాంకర్లు అకౌంట్లూ ఓపెన్ చేస్తారని తెలిపారు. హుజురాబాద్ నియోజకవర్గంలో సుమారు 21 వేల దళిత కుటుంబాలు ఉన్నాయని తెలిపారు. సర్వేకు వచ్చే అధికారులకు దళిత కుటుంబాలు సహకరించాలని కలెక్టర్ కోరారు. సర్వేకు ఏ రోజు వచ్చేది ఒక రోజు ముందుగానే గ్రామ పంచాయతీ కార్యదర్శులు సమాచారం అందిస్తారని చెప్పారు. గ్రామాలు విడిచి వెళ్లిన కుటుంబాల వివరాలు సైతం సేకరిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. లబ్ధిదారులు స్థాపించే యూనిట్ ల గురించి సర్వే అధికారులు అవగాహన కల్పిస్తారని, లబ్ధిదారులకు నచ్చిన యూనిట్ ను ఎంపిక చేసుకునే వీలు కూడా ఉందని అన్నారు. దళిత బంధు దళిత పథకానికి సంబంధించి ఇప్పటికే 1500 కోట్లు ప్రభుత్వం విడుదల చేసిందని కలెక్టర్ తెలిపారు. మరో రెండు, మూడు రోజుల్లొ మరో 500 కోట్లు ప్రభుత్వం విడుదల చేయనున్నదని తెలిపారు. దళిత బంధు పథకం పూర్తి స్థాయిలో విజయవంతం అయ్యెందుకు అందరూ సహకరించాలని కలెక్టర్ కోరారు.

హన్మకొండ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ కమలాపూర్ మండలంలో 4300 కుటుంబాలు ఉన్నాయని తెలిపారు.

సహాయ సంచాలకులు, జిల్లా పౌర సంబంధాల శాఖ కార్యాలయం కరీంనగర్ చే జారీ చేయడమైనది.

Share This Post