DPRO KMNR తేది: 26-08-2021 : ఫొటోలు & ప్రెస్ నోట్ : దళిత బంధు యాప్ పై క్లస్టర్ అధికారులకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అవగాహనా కల్పిస్తున్న జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్. (కరీంనగర్ జిల్లా ).

పత్రికా ప్రకటన తేదీ 26-08-2021

కరీంనగర్

దళిత బంధు సర్వే పకడ్బందీగా నిర్వహించాలి

దళిత బందు సర్వే పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహనా

జిల్లా కలెక్టర్ ఆర్.వి కర్ణన్
000000

 

శుక్రవారం నుండి జరుగు దళిత బందు సర్వే ను పగడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ అన్నారు.

గురువారం సాయంత్రం కలెక్టర్ సమావేశ మందిరంలో
క్లస్టర్ అధికారులు, స్పెషల్ ఆఫీసర్లకు నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. క్లస్టర్ ఆఫీసర్లు ,స్పెషల్ ఆఫీసర్లకు శుక్రవారం నుండి హుజూరాబాద్ నియోజకవర్గం లో జరుగు దళిత బందు సర్వే ఎలా చేయాలి అనే విధానంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు .ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సర్వే వివరాలను దళిత బంద్ యాప్ లో నమోదు చేయాలని సూచించారు. హుజూరాబాద్ నియోజకవర్గం లో దళిత బందు ఇంటింటి సర్వే పకడ్బందీగా చేయాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. ఎలాంటి అనుమానాలకు, సమస్యలకు తావు లేకుండా సర్వే విధానంపై పూర్తి స్థాయిలో అధికారులకు కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆన్లైన్, ఆఫ్లైన్ ప్రొఫార్మా లో వివరాలు ఎలా పూరించాలో తెలిపారు .సర్వే బృందాలు గ్రామంలోని దళితవాడలో ఇంటింటికి వెళ్లి వారితో మమేకమై పూర్తి వివరాలు సేకరించాలని ఆదేశించారు . ఆన్లైన్ వివరాలలో మార్పులు చేర్పులు ఉంటే ఆఫ్లైన్ ప్రొఫార్మా లో కుటుంబ వివరాలు పూరించాలని తెలిపారు. గ్రామాలలో ప్రజాప్రతినిధుల సమక్షంలో ఇంటింటి సర్వే నిర్వహించాలని, దళిత బందు లబ్ధిదారుల వివరాలు గ్రామములో ప్రదర్శించాలని, గ్రామ సభలు నిర్వహించి లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శ్యామ్ ప్రసాద్ లాల్ , గరిమ అగర్వాల్, అసిస్టెంట్ కలెక్టర్ మయాంక్ మిట్టల్, జిల్లా పరిషత్ సీఈవో ప్రియాంక, క్లస్టర్ ఆఫీసర్లు , స్పెషల్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.

జారీ చేసిన వారు సహాయ సంచాలకులు సమాచార పౌర సంబంధాల శాఖ కరీంనగర్.

Share This Post