DPRO KMNR తేది: 26-08-2021 : Photos & press note : దళిత బంధు సర్వే టీమ్ ల సమావేశం లో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్. (కరీంనగర్ జిల్లా ).

పత్రికా ప్రకటన తేదీ :26-08 -2021
కరీంనగర్

దళిత బంధు చారిత్రాత్మక కార్యక్రమం

నేటి నుండే దళిత బంధు ఇంటింటి సర్వే

దళిత వాడలోని ప్రతి ఇంటింటికి వెళ్లి సర్వే చేయాలి

జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్
00000

దళిత బంధు చారిత్రాత్మకమైన కార్యక్రమం అని, హుజురాబాద్ నియోజకవర్గంలో శుక్రవారం నుండి దళిత వాడలలో దళిత బంధు ఇంటింటి సర్వే చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ అన్నారు.

గురువారం కలెక్టరేట్ ఆడిటోరియంలో క్లస్టర్ ఆఫీసర్లు, స్పెషల్ ఆఫీసర్లు, బ్యాంకర్లు, సహాయ సిబ్బందితో దళిత బంధు సర్వే నిర్వాహణ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచంలో, దేశంలో ఎక్కడా దళిత బంధు పథకం లాంటి పథకం లేదని ఈ పథకాన్ని ప్రతి దళిత కుటుంబానికి అందించి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అన్నారు. ఈ పథకం ద్వారా ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సహాయం అందుతుందని, దీనితో దళితులు ఆర్థికంగా, సామాజికంగా ఎంతో అభివృద్ధి సాధిస్తారని అన్నారు. ఇలాంటి బృహత్కరమైన కార్యక్రమాన్ని హుజురాబాద్ నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్టుగా ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. హుజురాబాద్ నియోజకవర్గంలోని ప్రతి మండలానికి 3 – 4 గురు జిల్లా స్థాయి క్లస్టర్ ఆఫీసర్లను, వీరి క్రింద 4 – 5 గ్రామాలకు ఒక మండల స్థాయి స్పెషల్ ఆఫిసర్లు, సహాయ సిబ్బందిని నియమించామని కలెక్టర్ తెలిపారు. సర్వే టీములు శుక్రవారం ఉదయం 9.30 గంటలకు సర్వే ప్రారంభించాలని ఆదేశించారు. దళిత వాడలోని ప్రతి ఇంటింటికి క్లస్టర్ ఆఫీసర్, స్పెషల్ ఆఫీసర్, సహాయ సిబ్బంది వెళ్లి ఆన్ లైన్ డాటా తో పాటు ఆఫ్ లైన్ డాటా కూడా సేకరించాలని ఆదేశించారు. సేకరించిన డాటా వివరాలను దళిత బంధు యాప్ లో నమోదు చేయాలని అన్నారు. ఈ సర్వే టీముతో పాటు ఆ మండలానికి కేటాయించిన బ్యాంకు అధికారులు కూడా పాల్గొని వెంటనే దళిత కుటుంబాల లబ్ధిదారులకు కొత్తగా తెలంగాణ దళిత బంధు బ్యాంక్ అక్కౌంట్ ఖాతాలను తెరుస్తారని తెలిపారు. ప్రతి మండలానికి దళిత బంధు ఖాతాలు తెరుచుటకు బ్యాంకులను కేటాయించామని, హుజురాబాద్ రూరల్ మున్సిపాలిటీకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకు, ఇల్లందకుంట లో తెలంగాణ గ్రామీణ బ్యాంకు, వీణవంక కెడిసిసి బ్యాంకు, జమ్మికుంట రూరల్ ఎస్.బి.ఐ. బ్యాంకు, జమ్మికుంట మున్సిపాలిటీలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంకులను కేటాయించినట్లు కలెక్టర్ తెలిపారు. గురువారం సాయంత్రం దళిత వాడల్లో సర్వే టీములు వస్తున్నట్లు టాం టాం చేయించాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా అధికారులకు నిరుపేద దళితుల కుటుంబాలను ఆర్థికంగా అభివృద్ధి చేసి సమాజంలో ఇతర కులాలతో సమానంగా నిలుపుటకు దళిత బంధు పథకం క్రింద ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయల చొప్పున అందించే అద్బుత అవకాశం వచ్చిందని అన్నారు. అధికారులు , సిబ్బంది అంకిత భావంతో పారదర్శకంగా ఓపిక, సేవభావం తో ప్రతి దళిత కుటుంబాలను సర్వే చేసి వివరాలను సేకరించి, పథకాన్ని విజయవంతంగా అమలు చేయాలని అన్నారు. దళిత బంధు సర్వే పై ప్రతి మండలానికి ఒక రాష్ట్ర స్థాయి అధికారిని పర్యవేక్షకులుగా ప్రభుత్వం నియమించిందని కలెక్టర్ తెలిపారు. వీరు కూడా దళిత బంధు ఇంటింటి సర్వే పై ప్రతి రోజు గ్రామాలలో పర్యటిస్తూ సర్వేను పర్యవేక్షిస్తారని తెలిపారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు శ్యాం ప్రసాద్ లాల్, గరీమా అగర్వాల్, అసిస్టెంట్ కలెక్టర్ మయాంక్ మిట్టల్, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహణ అధికారి ప్రియాంక, రాష్ట్ర స్థాయి అధికారులు, కరీంనగర్, హుజురాబాద్ ఆర్.డి.వో.లు ఆనంద్ కుమార్, రవిందర్ రెడ్డి, క్లస్టర్ ఆఫీసర్లు, స్పెషల్ ఆఫీసర్లు, బ్యాంకర్లు, సహాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 

సహాయ సంచాలకులు, జిల్లా పౌర సంబంధాల శాఖ కార్యాలయం కరీంనగర్ చే జారీ చేయడమైనది.

Share This Post