DPRO KMNR తేది : 28-07-2021 : ఫోటోలు & ప్రెస్ నోట్ : దళిత వాడలలో మౌళిక సదుపాయాల కల్పన అంచనాలు తయారుపై సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్. (కరీంనగర్ జిల్లా).

పత్రికా ప్రకటన తేదీ
28- 07-2021

కరీంనగర్

దళిత వాడల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రెండు రోజుల్లో ప్రతిపాదనలు సమర్పించాలి

జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్
00000

హుజూరాబాద్ నియోజక వర్గం లోని అన్ని గ్రామాలలో గల దళిత వాడలలో మౌలిక సదుపాయాల కల్పనకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించి ప్రతిపాదనలు సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ అన్నారు.

బుధవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో పంచాయతీ రాజ్, ట్రాన్స్కో ఇంజనీరింగ్ అధికారులు,ఎంపీడీవోలు ఎంపీవోలు, గ్రామ కార్యదర్శులతో గ్రామం లోని దళిత వాడాలలో మౌళిక వసతుల కల్పన పై సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హుజరాబాద్ నియోజకవర్గం లోని 139 దళితవాడలు ఉన్నాయని తెలిపారు. హుజరాబాద్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామపంచాయతీలో సంబంధిత గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులు, పంచాయతీ రాజ్ ఏఈ,ట్రాన్స్ ఏఈ ,స్థానిక యువకులు, రిటైర్డ్ ఉద్యోగులు, రిసోర్స్ పర్సన్ లతో కలిసి దళితవాడలను సందర్శించాలని కలెక్టర్ ఆదేశించారు. దళితవాడలలో సిసి రోడ్లు,డ్రైనేజీలు,విద్యుత్ దీపాలు, ఇండ్ల పై నుండి వెళ్ళు హెచ్.టి. విద్యుత్ లైన్లు మొదలగు వివరాలను పరిశీలించి రిజిస్టర్లో నమోదు చేయాలని ఆదేశించారు దళితవాడలో గల సమస్యలను దళితులను అడిగి తెలుసుకొని రిజిస్టర్లో నమోదు చేయాలని అన్నారు ఒక్క దళితవాడ కూడా విస్మరించకూడదు అని ఆదేశించారు. దళితవాడలో మౌలిక సదుపాయాల కల్పన కార్యాచరణ ప్రణాళిక తయారు చేయుటకు ఎంపీడీవోలు, మండల స్పెషల్ ఆఫీసర్ నోడల్ అధికారిగా వ్యవహరిస్తారని కలెక్టర్ తెలిపారు. అలాగే గ్రామాలలో గల దళితుల భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ బృందాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మిషన్ భగీరథ ద్వారా అన్ని దళితవాడలకు కు త్రాగునీరు సరఫరా సరఫరాపై వేరుగా బృందాలను పంపిస్తున్నామని కలెక్టర్ తెలిపారు

వరంగల్ అర్బన్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ హుజురాబాద్ నియోజకవర్గంలోని అన్ని దళితవాడలలో మౌలిక సదుపాయాలు కల్పించుటకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. దళితవాడలో గల ఇతర సమస్యలను అడిగి తెలుసుకుని నివేదిక సమర్పించాలని అన్నారు సంబంధిత గ్రామ పంచాయితీ సర్పంచులు, గ్రామ సెక్రటరీలు దళిత వాడలను సందర్శించాలని అన్నారు దళితవాడలో సిసి రోడ్డు నిర్మాణం, డ్రైనేజీలు నిర్మాణం, సైడ్ డ్రైన్స్,కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేయాలని సూచించారు. దళితవాడలకు రవాణా సౌకర్యం ఉన్నది లేనిది, రేషన్ కార్డులు, ఆసరా పింఛన్లు గ్రామ కంఠం భూముల లో ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు మొదలగు అన్ని సమస్యలను దళితుల నుండి తెలుసుకొని రిజిస్టర్లో నమోదు చేయాలని అన్నారు

పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ సంజీవ రావు మాట్లాడుతూ హుజరాబాద్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ఏఈ,2- 3 గ్రామ పంచాయతీలకు ఒక డిఈ, మండలానికి ఒక ఈఈ ని దళితవాడలలో మౌలిక వసతుల కల్పనకు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించడం కోసం నియమించామని తెలిపారు. సంబంధిత ఇంజనీర్లు సంబంధిత గ్రామ సర్పంచ్ సెక్రెటరీ లతో కలిసి దళితవాడ లలో సిసి రోడ్లు ఉన్నవా లేవా డ్రైనేజీలు, స్ట్రీట్ లైట్ లు ఉన్నవి లేనివి పరిశీలించి అవసరమైన సిసి రోడ్లు డ్రైనేజీలు సైడ్ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రెండు రోజుల్లో అంచనాలు తయారు తయారుచేసి సమర్పించాలని ఆదేశించారు ఇంజనీర్లను ఆదేశించారు . దళితవాడలో ఇతర సమస్యలను కూడా వారిని అడిగి తెలుసుకొని రిజిస్టర్లో నమోదు చేయాలని సూచించారు.

ఎన్పిడిసిఎల్ చీఫ్ ఇంజనీర్ మోహన్ రావు మాట్లాడుతూ దళితవాడలలో ప్రతి ఇంటికి విద్యుత్ కలెక్షన్ ఉన్నది లేనిది పరిశీలించి నివేదిక సమర్పించాలని అన్నారు. దళితవాడలో 100 యూనిట్ల వరకు ప్రభుత్వం ఉచిత విద్యుత్ సరఫరా చేస్తుందని దళితవాడలలో విద్యుత్ వివరాలు సమర్పించాలని అన్నారు. దళితవాడలో స్ట్రీట్ లైట్ ఉన్నవి లేనివి లేకుంటే వెంటనే ప్రతిపాదనలు తయారు చేసి సమర్పించాలని అన్నారు దళితవాడలో ఇంటి పై నుండి హెచ్ డి విద్యుత్తు లైను వివరాలు సమర్పించాలని అన్నారు దళితవాడలో అదనపు విద్యుత్ స్తంభాలు అవసరం ఉన్న వాటిని గుర్తించి ప్రతిపాదనలు సమర్పించాలని అన్నారు

ఈ సమావేశంలో లోకల్ బాడీస్ అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్, ట్రైని కలెక్టర్ మయాంక్ మిట్టల్, జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య, పంచాయతీరాజ్ ట్రాన్స్కో ఇంజనీర్లు ఎంపీడీవోలు ఎంపీడీవోలు పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

సహాయ సంచాలకులు జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం కరీంనగర్ చే జారీ చేయడమైనదిDouble bedroom incharge list

Share This Post