DPRO KMNR తేది : 28-08-2021 : press note : హుజురాబాద్ మండల కేంద్రంలోని ఎస్ డబ్ల్యూ కాలనీ, గాంధీనగర్ మరియు ఇందిరా నగర్ కాలనీ లో దళిత బంధు డోర్ టు డోర్ సర్వే లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్. (కరీంనగర్ జిల్లా)

పత్రికా ప్రకటన తేదీ :27-8-2021

లాభసాటి యూనిట్లను ఎంపిక చేసుకోవాలి

దళితులు అందరికీ దళిత బందు

జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్

హుజురాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు సర్వే తీరు పరిశీలన

దళితుల ఇండ్ల లోకి వెళ్లి కుటుంబాలతో ముచ్చటించిన కలెక్టర్
00000

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దళిత బంధు పథకం దళితులు అందరికీ అందుతుందని జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ తెలిపారు.

హుజరాబాద్ నియోజకవర్గం లో ప్రారంభమైన దళిత బంధు సర్వేను కలెక్టర్ శనివారం పరిశీలించారు. హుజరాబాద్ అర్బన్ లోని 15 వార్డు ఎస్ డబ్ల్యూ కాలనీ లో, గాంధీనగర్ 29వ వార్డు లో, ఇందిరా నగర్ కాలనీ లో నీ ఎస్సీ కాలనీ లోని దళిత కుటుంబాలను స్వయంగా కలిసి వారితో ముచ్చటించారు. కుటుంబంలోని సభ్యుల్ని పలకరిస్తూ వారి ఆర్థిక జీవన స్థితిగతుల్ని తెలుసుకున్నారు. వారు ఎంపిక చేసుకున్న యూనిట్ల గురించి అడిగారు. దళిత బంధు ద్వారా అందే 10 లక్షల రూపాయలతో లాభసాటి యూనిట్లను ఎంపిక చేసుకొని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. సమగ్ర కుటుంబ సర్వే సంఖ్యతో పాటు, రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, సెల్ ఫోన్ నెంబర్ లను నమోదు చేయాలని, సమగ్ర వివరాలను తీసుకోవాలని సర్వే బృందం అధికారులను ఆదేశించారు. దళిత బందుతో ఆర్థికంగా ఎదిగి ధనవంతులు కావాలని, దళిత కుటుంబాల సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జమ్మికుంట మండలంలోని వెంకటేశ్వర పల్లి గ్రామపంచాయతీ లో బేడ బుడగ జంగాల కాలనీ( ఎస్సీ), అంబేద్కర్ నగర్, కొత్తపల్లి గ్రామం ఎరుకల కాలనీ లోని దళిత కుటుంబాలను కలిసి మాట్లాడారు. ఎరుకల కాలనీ లోని శనిగరపు ఐలయ్య ఇంట్లో చాపపై కూర్చుని వారు ఎంపిక చేసుకున్న యూనిట్ గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ లాభసాటి యూనిట్లను ఎంపిక చేసుకొని ఆర్థికంగా ఎదగాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో హుజరాబాద్ ఆర్ డి ఓ రవీందర్ రెడ్డి, క్లస్టర్ అధికారులు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్, జిల్లా మార్కెటింగ్ అధికారి పద్మావతి, జిల్లా సహకార అధికారి శ్రీ మాల, ప్రత్యేక అధికారులు, తహసిల్దార్ లు తదితరులుపాల్గొన్నారు.

సహాయ సంచాలకులు, జిల్లా పౌరసంబంధాల శాఖ కరీంనగర్చ్ జారీ చేయడమైనది

Share This Post