: జమ్మికుంట మండలం రామన్న పల్లి మరియు ఇల్లందకుంట మండలం లో పోలింగ్ కేంద్రంలో లైటింగ్ ఏర్పాట్లను పరిశీలిస్తున్న జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్ వి కర్ణన్,.

 

 

పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్

హుజురాబాద్ శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నిక ఈనెల 30 న జరగనున్న సందర్భంగా హుజూరాబాద్ నియోజకవర్గం లోని పోలింగ్ కేంద్రాలను గురువారం రాత్రి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్ వి కర్ణన్ తనిఖీ చేశారు. పోలింగ్ కేంద్రాల్లో విద్యుత్ సౌకర్యం పరిశీలించారు. జమ్మికుంట మండలం లోని జడ్.పి.హెచ్.ఎస్ బాలురు, రామన్నపల్లి లోని జడ్.పి.హెచ్.ఎస్, ఇల్లంతకుంట మండలం శ్రీ రాముల పల్లె లోని ప్రాథమిక ఉన్నత పాఠశాల, జమ్మికుంట మండలం సాయం పేట లోని ప్రాథమికోన్నత పాఠశాల, నాగం పేట లోని ప్రాథమిక పాఠశాలలో గల పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ తనిఖీ చేశారు. పోలింగ్ కేంద్రాలలో లైటింగ్ తో పాటు పోలింగ్ కేంద్రాల ఆవరణలోనూ లైటింగ్ సౌకర్యం ఉండేలా చూడాలన్నారు.

కలెక్టర్ ఆర్ ఆర్ వి కర్ణన్ వెంట అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్, అసిస్టెంట్ కలెక్టర్ మయాంక్ మిట్టల్, తాసిల్దార్ లు తదితరులు ఉన్నారు.

Share This Post