DPRO KMNR తేది: 30-07-2021 : ఫొటోలు & ప్రెస్ నోట్ : హుజరాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన దళితవాడలో వసతులు మరియు అభివృద్ధి పై సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న ఆర్ వి కర్ణన్, అదనపు కలెక్టర్లు గరిమ అగర్వాల్, శ్యామ్ ప్రసాద్ లాల్, ట్రెని కలెక్టర్ మయాంక్ మిట్టల్ ( కరీంనగర్ జిల్లా )

పత్రిక ప్రకటన తేదీ 30-07 -2021
కరీంనగర్

సర్వే చేసి అర్హుల జాబితా సిద్ధం చేయండి

జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్

V00000

హుజురాబాద్ నియోజకవర్గం లోని దళితులు ఖాళీ స్థలాలు కలిగి ఉండి డబుల్ బెడ్ రూం నిర్మించుకోవాలనే వారి కోసం సర్వే చేపట్టి అర్హులైన వారి జాబితా సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ అన్నారు.

శుక్రవారం రాత్రి కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎం.పి.డి వో.లు, డిఎల్పివోలు., సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారులుతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హుజురాబాద్ నియోజకవర్గంలోని దళిత వాడలలో ఎంత మందికి స్వంతంగా ఇండ్లు ఉన్నాయి, ఎంత మందికి ఖాళీ స్థలాలు ఉన్నాయి ఉంటే అవి అబాది, పట్టాభూమీ లేదా ప్రభుత్వ భూమి యా అని గుర్తించాలని అన్నారు. ఈ స్థలాలను ధరణిలో రేషన్ కార్డు సహాయంతో పర్మిషన్ తీసుకోవాలని తెలిపారు. ఈ స్థలాలలో ఎటువంటి కోర్టు కేసులు లేకుండా చూడాలని, వీటికి మ్యూటేషన్ అయ్యే విధంగా చూడాలని అన్నారు. గ్రామ సర్పంచులు, పంచాయితీ కార్యదర్శులు, రిసోర్స్ పర్సన్లు ఇండ్ల స్థలాలకు సంబంధించిన సర్వే పూర్తి చేయాలని అన్నారు. ఇంటింటి సర్వే చేసి ఇండ్లు ఉన్నవారి జాబితాను సేకరించి లేని వారికి ఇండ్లు అందించాలని తెలిపారు. ఎస్.సి., బి.సి., నాయి బ్రహ్మణలకు కమ్యూనిటీ హాల్ లకు స్థలాలను గుర్తించాలని అన్నారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు శ్యాం ప్రసాద్ లాల్, గరీమా అగర్వాల్, ట్రైనీ కలెక్టర్ మయాంక్ మిట్టల్, డి.పి.వో. వీర బుచ్చయ్య, హుజురాబాద్ ఆర్.డి.వో. రవీందర్ , సర్వే అండ్ ల్యాండ్స్ రికార్డ్స్ ఏ.డి. అశోక్, వెనుకబడిన తరగతుల అధికారి రాజా మనోహర్ రావు, డి.ఎస్.వో. సురేష్ రెడ్డి, ఎమ్మార్వోలు, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు, తదితరులు పాల్గొన్నారు.

జారీ చేసిన వారు సహాయ సంచాలకులు సమాచార పౌర సంబంధాల శాఖ కరీంనగర్

Share This Post