పత్రికా ప్రకటన తేదీ
30-07-2021
కరీంనగర్
కరీంనగర్ డైయిరి దేశానికి ఆదర్శం, స్ఫూర్తిదాయకం
జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్
O0o
కరీంనగర్ డైయిరి దేశానికి ఆదర్శమని ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ అన్నారు .
శుక్రవారం కలెక్టర్ కరీంనగర్ డైయిరి సందర్శించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కరీంనగర్ డైయిరి రాష్ట్రంలోనే నెంబర్ వన్ గా నిలిచింది అన్నారు .గత 20 సంవత్సరాల క్రితం కరీంనగర్ డైరీ ఎన్నో నష్టాలలో ఉండేదని, పాలకవర్గం తీసుకున్న వినూత్న కార్యక్రమాలతో ప్రస్తుతము లాభాల బాటలో నడుస్తుందని తెలిపారు. కరీంనగర్ డైయిరి ఇతర జిల్లాలలో కూడా విస్తరించాలని కలెక్టర్ చైర్మన్ కు సూచించారు. కరీంనగర్ డైయిరి విస్తరణ వల్ల యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, గ్రామీణ ప్రాంత పాడి రైతులు ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారని పేర్కొన్నారు. తిమ్మాపూర్ మండలం నల్లగొండ గ్రామంలో మూడు లక్షల లీటర్ల సామర్థ్యం తో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో డైయిరి ని ఏర్పాటు చేయడం అభినందనీయమని కలెక్టర్ అన్నారు. కరీంనగర్ డైరీ ద్వారా నాణ్యమైన పాలు వినియోగదారులకు అందుతున్నాయని తెలిపారు .అలాగే వివిధ రకాల పాల పదార్థాలు వినియోగదారుల అభిరుచుల కారణంగా తయారుచేసి వినియోగదారుల మన్ననలను పొందుతున్నారని అన్నారు .ముందుగా కలెక్టర్ డైయిరి లో పాల ఉత్పత్తుల తయారీ యూనిట్లను, పాల ప్యాకెట్ల ప్యాకింగ్ యూనిట్లను, డైయిరి చైర్మన్ సిహెచ్ రాజేశ్వరరావు కలెక్టర్ కు చూపించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కరీంనగర్ డైయిరి ద్వారా రోజుకు ఎన్ని లీటర్ల పాల సేకరణ జరుగుచున్నది టర్న్ వోవర్ వివరాలను చైర్మన్ ను అడిగి తెలుసుకున్నారు .ఈ సందర్భంగా డైయిరి చైర్మన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రోజు పాల సేకరణ ,పాల పదార్థాలు తయారీ, డైరీ విస్తరణ ,జిల్లాలో పాడి రైతుల వివరాలు , కార్య కలాపాలు, టర్నోవర్ , పాడి రైతులకు అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు .
కార్యక్రమంలో డైరీ చైర్మన్ సిహెచ్ రాజేశ్వరరావు , జిల్లా పరిషత్ సీఈవో ప్రియాంక, డైరీ మేనేజింగ్ డైరెక్టర్ శంకర్ రెడ్డి , అడ్వైజర్ వి .హనుమంత రెడ్డి,డైరెక్టర్లు ప్రభాకర్ రావు, నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు .
జారీ చేసిన వారు సహాయ సంచాలకులు సమాచార పౌర సంబంధాల శాఖ కరీంనగర్