DPRO KMNR తేది : 30-07-2021 : ఫోటోలు & ప్రెస్ నోట్ : నగరంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్, కూరగాయల మార్కెట్ ను పరిశీలన, కేబుల్ బ్రిడ్జి ను పరిశీలన ,మానేరు రివర్ ఫ్రంట్ పనుల వివరాలు అధికారులను అడిగి తెలుసుకుంటున్న జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్, మున్సిపల్ కమిషనర్ వల్లూరి క్రాంతి. (కరీంనగర్ జిల్లా).

పత్రికా ప్రకటన

తేదీ 30- 07 -2021

కరీంనగర్

కూరగాయల మార్కెట్ లలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి

సమీకృత మార్కెట్ యార్డ్ కోసం స్థల పరిశీలన

మానేరు రివర్ ఫ్రంట్ పనుల పరిశీలన

జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్
0000

కూరగాయలు అమ్మే మార్కెట్ లలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ అన్నారు.

శుక్రవారం నగరంలోని శనివారం మార్కెట్ లోని కూరగాయలు అమ్మే రైతు బజార్ ను కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కూరగాయలను రైతులకు కేటాయించిన గద్దెల పైననే అమ్మాలని, క్రింద రోడ్డుపై అమ్మ కూడదని అన్నారు. కూరగాయల మార్కెట్ లో కూరగాయల అమ్మే రైతులందరూ వారికి కేటాయించిన గద్దెల స్థలం పైన కూర్చుని కూరగాయలు అమ్మేలా చర్యలు చేపట్టాలని జిల్లా మార్కెటింగ్ అధికారిని కలెక్టర్ ఆదేశించారు. కూరగాయలు అమ్మే రైతులందరూ గుర్తింపు కార్డును మెడలో ధరించాలని సూచించారు. కూరగాయలు పండించే రైతులు వినియోగదారులకు నాణ్యమైన తాజా కూరగాయలను అమ్మాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కూరగాయలు అమ్మే రైతులతో మాట్లాడుతూ కూరగాయలను గ్రామాల నుండి ఉదయము ఎన్ని గంటలకు మార్కెట్ కు తీసుకువస్తారని ,తిరిగి ఎన్ని గంటలకు గ్రామాలకు వెళ్తారని అడిగి తెలుసుకున్నారు. రైతులు పండించిన కూరగాయలు జిల్లా కేంద్రంలోని రైతుబజార్లలకు తీసుకువచ్చి అమ్ము కొనుటకు రవాణా సౌకర్యం ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు.కూరగాయలు అమ్మే రైతులందరూ కరోనా వ్యాక్సినేషన్ టీకా తీసుకున్నారా, ఎన్ని డోసులు తీసుకున్నారు, టీకా తీసుకోకుంటే వెంటనే తీసుకోవాలని సూచించారు . కలెక్టర్ ముందుగా జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ లో సమీకృత కూరగాయల మార్కెట్ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించారు.

అనంతరం ఎల్ఎండి నీ సందర్శించి ఎల్ఎండి లో ఉన్న నీటిమట్టాన్ని ఇరిగేషన్ ఎస్ఈ నీ అడిగి తెలుసుకున్నారు. అలాగే మానేరు రివర్ ఫ్రంట్ నిర్మాణం పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎల్ఎండి లో చేపల ఉత్పత్తి చాలా బాగుందని అన్నారు. ఈ సందర్భంగా మత్స్యకారులతో మాట్లాడుతూ ఎల్ఎండి లో పట్టిన చేపలను ఎక్కడ విక్రయిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎల్ఎండి కట్ట క్రింద రాష్ట్ర ముఖ్యమంత్రి హరిత హారంలో నాటిన మొక్కలను కలెక్టర్ పరిశీలించారు.

తీగల వంతెన పరిశీలన:

మానేరు పై నిర్మిస్తున్న కేబుల్ బ్రిడ్జి (తీగల వంతెన) పనులను కలెక్టర్ పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేబుల్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి కి ఎంత సమయం పడుతుందని త్వరగా పూర్తి చేయాలని అన్నారు.దుర్గం చెరువు బ్రిడ్జి లాగా లైటింగ్ ఏర్పాటు చేసి అందంగా తీర్చి దిద్దాలన్నారు.

ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ కమిషనర్ వల్లూరి క్రాంతి, జిల్లా మార్కెటింగ్ అధికారి పద్మావతి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఎలుక అనిత- ఆంజనేయులు, ఇరిగేషన్ ఎస్ఈ శివ కుమార్ ఈఈ నాగభూషణం, రోడ్లు భవనాల శాఖ ఈఈ సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

జారీ చేసిన వారు సహాయ సంచాలకులు, సమాచార పౌర సంబంధాల శాఖ కరీంనగర్.

Share This Post