DPRO KMNR తేది : 30-08-2021 : ఫోటోలు & press note : కలెక్టరేటు లో జరిగిన డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో మాట్లాడుచున్న కలెక్టర్ ఆర్ వి కర్ణన్. (కరీంనగర్ జిల్లా).

పత్రికా ప్రకటన

తేది:30 -08-2021

డయల్ యువర్ కలెక్టర్ కు ప్రజలు తెలిపే సమస్యలను వెంటనే పరిష్కరించాలి

జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్
-000-

డయల్ యువర్ కలెక్టర్ కు ప్రజలు తెలిపే సమస్యలను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ అధికారులకు ఆదేశించారు.

సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో కలిసి డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దూర ప్రాంతాల నుండి జిల్లా కేంద్రానికి రాలేని ప్రజల సమస్యల పరిష్కారానికే డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి వచ్చిన ప్రజా సమస్యలు పెండింగులో లేకుండా త్వరగా ఎప్పటి- కప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కరీంనగర్ రూరల్ మండలం ఆరేపెల్లి గ్రామం నుండి సత్తినేని లక్ష్మీ మాట్లాడుతూ తనకు పట్టాదారు పాసు బుక్ రాలేదని కలెక్టర్ కు తెలిపారు. మీ-సేవా లో ధరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ ఆమెకు సూచించారు. జమ్మికుంట మండల అంకుశాపూర్ నుండి రామారావు మాట్లాడుతూ తన తండ్రి పేరిట ఉన్న భూమిని తల్లి పేరు మీదకు మార్చాలని కోరారు. అన్నదమ్ములు, అక్క చెల్లళ్లు అందరూ కలిసి నో అబ్జెక్షన్ అఫిడవిట్ ఇవ్వాలని అప్పుడు పేరు మార్పు జరుగుతుందని తెలిపారు. జమ్మికుంట మండల నుండి పొద్దుటూరి వీరయ్య మాట్లాడుతూ తన పొలం గట్టు ఆక్రమించి పక్క రైతు దున్నుతున్నాడని ఫిర్యాదు చేయగా, తహశీల్దార్ పరిశీలించి చర్యలు తీసుకుంటారని కలెక్టర్ తెలిపారు. తిమ్మాపూర్ మండలం నుంచి బిల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ తన కుమారుడికి జూనియర్ కాలేజీలో ఉపకార వేతనం మంజూరు కాలేదని తెలిపారు. ప్రభుత్వం త్వరలోనే ఉపకార వేతనాలు మంజూరు చేస్తుందని కలెక్టర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్, జిల్లా వైద్యాధికారి డా. జువేరియా, జిల్లా అగ్నిమాపక శాఖాధికారి వెంకన్న, ఎస్సి కార్పోరేషన్ ఈ.డి. సురేష్, కలెక్టరేట్ ఏ.వో. లక్ష్మా రెడ్డి, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సహాయ సంచాలకులు, జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం కరీంనగర్ చేజారీచేయనైనది

Share This Post