DPRO KMNR తేది : 30-08-2021 : ఫోటోలు & press note : కలెక్టరేటు ఆడిటోరియం లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజా పిర్యాదులు స్వీకరిస్తున్న జిల్లా పరిషత్ సీఈవో ప్రియాంక (కరీంనగర్ జిల్లా).

పత్రికా ప్రకటన తేది:30-08-2021
కరీంనగర్

ప్రజాసమస్యల సత్వర పరిష్కారం కోసమే ప్రజావాణి

ప్రజావాణికి 88 ధరఖాస్తులు

జిల్లా పరిషత్ సీఈవో ప్రియాంక
-000-
ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు జిల్లా పరిషత్ సీఈవో ప్రియాంక తెలిపారు.

సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో కరోనా నిబంధనల ప్రకారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా లోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజల సమస్యలకు సంబంధించిన 88 ధరఖాస్తులు స్వీకరించడం జరిగిందన్నారు. ప్రజల నుండి అందిన ధరఖాస్తులను పరిష్కరించుటకు వెంటనే సంబంధిత శాఖలకు పంపినట్లు తెలిపారు. ఇందులో 57 రెవెన్యూకు సంబంధించినవి , 04 మున్సిపాలిటీ కి చెందినవి, జిల్లా మెడికల్ మరియు హెల్త్ కి చెందినవి 03, 14 ఇతర శాఖలకు సంబంధించినవని అయన తెలిపారు. సంబంధిత అధికారులు ప్రజావాణిలో వచ్చిన ధరఖాస్తులను ప్రాధాన్యతతో వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్, జిల్లా వైద్యాధికారి డా. జువేరియా, జిల్లా అగ్నిమాపక శాఖాధికారి వెంకన్న, ఎస్సి కార్పోరేషన్ ఈ.డి. సురేష్, కలెక్టరేట్ ఏ.వో. లక్ష్మా రెడ్డి, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు, సిబ్బంది తదితరులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

సహాయ సంచాలకులు, జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం కరీంనగర్ చేజారీచేయనైనది

Share This Post