DPRO KMNR తేది: 31-07-2021 : ఫొటోలు & PRESS NOTE : హుజురాబాద్ నియోజకవర్గం లో దళిత వాడలో మౌలిక సదుపాయాల కల్పన పై దళిత బంధు మండల రిసోర్స్ పర్సన్స్ మరియు ఎంపీడీవో లతో సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్. ( కరీంనగర్ జిల్లా )

పత్రికా ప్రకటన

తేదీ 31- 07-2021

కరీంనగర్

నేటి నుండి హుజూరాబాద్ నియోజకవర్గం లో కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తుల స్వీకరణ

జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్
O0000

హుజురాబాద్ నియోజకవర్గంలో రేషన్ కార్డులు లేని వారికి కొత్తగా రేషన్ కార్డులు మంజూరు చేయుటకు ఆదివారం నుండి దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఆర్.వి కర్ణన్ అన్నారు.

శనివారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో హుజరాబాద్ నియోజకవర్గం నకు సంబంధించిన ఎంపీడీవోలు, దళిత బంధు మండల రిసోర్స్ పర్సన్ లతో హుజూరాబాద్ నియోజకవర్గం లోని దళిత వాడల్లో మౌలిక వసతుల కల్పన,మిషన్ భగీరథ, ఎలక్ట్రిసిటీ, రెవెన్యూ తదితర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు .ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హుజరాబాద్ నియోజకవర్గంలోని అర్హులైన ప్రజలందరికీ ఆహార భద్రత కార్డులు మంజూరు లక్ష్యంతో రేషన్ కార్డు లేని వారందరికీ కొత్త రేషన్ కార్డుల మంజూరుకు ఆదివారం నుండి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఆయన తెలిపారు. నియోజకవర్గం లోని దళితవాడలలో మౌలిక వసతుల కల్పన కోసం పంచాయతీరాజ్, రెవెన్యూ ,మిషన్ భగీరథ, విద్యుత్ శాఖ అధికారులు సర్వే చేసి ప్రతిపాదనలు సమర్పించారని కలెక్టర్ తెలిపారు .హుజరాబాద్ నియోజకవర్గం పరిధిలోని గ్రామాలలోని అన్ని దళితవాడల్లో సిసి రోడ్లు, డ్రైనేజీలు నిర్మాణం, ఇతర మౌలిక వసతుల కల్పనకు సర్వే టీములు సమర్పించిన ప్రతిపాదనల ప్రకారం 70 కోట్ల నిధులు మంజూరైనట్లు కలెక్టర్ తెలిపారు. మండల, గ్రామాల రిసోర్స్ పర్సన్ లు సంబంధిత గ్రామ పంచాయతీ సర్పంచ్ ల తో కలిసి దళితవాడల్లో సిసి రోడ్లు ,డ్రైనేజీ నిర్మాణ పనులు వెంటనే గ్రౌండింగ్ అయ్యేలా చర్యలు చేపట్టాలని సూచించారు . అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయుటకు కృషిచేయాలని కలెక్టర్ సూచించారు .రిసోర్స్ పర్సన్లు గ్రామాలలో రేషన్ కార్డు లేని వారందరినీ గుర్తించి వెంటనే దరఖాస్తు చేసుకునేలా ప్రోత్సహించాలని కలెక్టర్ సూచించారు.హుజరాబాద్ నియోజవర్గం లోని అన్ని గ్రామాల లోని దళితవాడల లో రెవెన్యూ, మిషన్ భగీరథ, విద్యుత్ శాఖ అధికారులు గ్రామాలలో సర్వే చేసి సమస్యలను గుర్తించారని కలెక్టర్ తెలిపారు .అన్ని దళితవాడల లోని ఇండ్లకు విద్యుత్ కనెక్షన్లు, వంగిపోయిన విద్యుత్ స్తంభాలను సరి చేయుట ,కొత్తగా విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయడం మొదలగు పనులు త్వరలో చేపడతారని కలెక్టర్ తెలిపారు. అలాగే నియోజకవర్గంలోని అన్ని దళితవాడలలో ఇంటింటికి మిషన్ భగీరథ త్రాగునీరు సరఫరాకు సంబంధించి అవసరమైన చోట కొత్తగా పైప్ లైన్లు వేసి నల్లాలు బిగించుట, లీకేజీలు అరికట్టుట, మొదలగు పనులను వెంటనే చేపడతారని కలెక్టర్ తెలిపారు. రెవెన్యూ సిబ్బంది అన్ని దళితవాడలలో భూ సమస్యలను గుర్తించి నివేదిక తయారు చేశారని భూ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామని కలెక్టర్ తెలిపారు. సిసి రోడ్లను డ్రైనేజ్ పనులను చేపట్టుటకు పంచాయతీరాజ్ శాఖ ప్రతి గ్రామంలో ఒక బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ,దళిత బందు మండల రిసోర్స్ పర్సన్ లు సర్పంచుల సహకారంతో పనులను యుద్ధ ప్రాతిపదికన గ్రౌండింగ్ చేయాలన్నారు. మండల దళిత బంధు రిసోర్స్ పర్సన్లు చురుకుగా పాల్గొని సిసి రోడ్లు డ్రైనేజీ పనులు త్వరితగతిన పూర్తయ్యేందుకు కృషి చేయాలన్నారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు శ్యామ్ ప్రసాద్ లాల్, గరిమ అగర్వాల్ ,ట్రైని కలెక్టర్ మయాంక్ మిట్టల్, డిఆర్డిఓ శ్రీలతా, ముఖ్య ప్రణాళిక అధికారి కొమురయ్య, హుజురాబాద్ ఆర్డిఓ రవీందర్ రెడ్డి , మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు మండల దళిత బందు రిసోర్స్ పర్సన్లు తదితరులు పాల్గొన్నారు .

 

జారీ చేసిన వారు సహాయ సంచాలకులు సమాచార పౌర సంబంధాల శాఖ కరీంనగర్

Share This Post