పత్రిక ప్రకటన తేదీ 31-07 -2021
కరీంనగర్
ఇండ్ల మోటివేషన్ లకు చర్యలు చేపట్టాలి
జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్
00000
హుజురాబాద్ నియోజకవర్గం లోని దళితులు కొనుగోలు చేసుకొని ఉంటున్నా ఇండ్లకు మోటివేషన్ చేయుటకు తగిన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ అన్నారు .
శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ముఖ్యమంత్రి కార్యాలయం ఓఎస్డీ రామయ్యతో కలిసి హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితులు కొనుగోలు చేసిన ఇండ్ల మోటివేషన్లు , ప్రభుత్వ భూములు, గ్రామకంఠం భూములలో ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు ఇచ్చుటకు కొత్త పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని అన్నారు.
ముఖ్యమంత్రి కార్యాలయ ఓఎస్డి రామయ్య మాట్లాడుతూ హుజరాబాద్ నియోజవర్గంలో దళితులు ఇండ్లు కొనుగోలు చేసుకుని ఉంటున్నా వారి పేరున లేని ఇండ్లకు మోటేషన్లు చేయుటకు ఎన్ని పెండింగ్ లో ఉన్నాయి ఏ ఏ స్థాయిలో ఉన్నాయి అని తెలుసుకున్నారు వాటిని మోటేషన్లు చేయుటకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, లింకు డాక్యుమెంట్లు ప్రకారము మోటేషన్ చేయాలని సూచించారు .
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు శ్యాం ప్రసాద్ లాల్, , ట్రైనీ కలెక్టర్ మయాంక్ మిట్టల్, డి.పి.వో. వీర బుచ్చయ్య, హుజురాబాద్ ఆర్.డి.వో. రవీందర్ , సర్వే అండ్ ల్యాండ్స్ రికార్డ్స్ ఏ.డి. అశోక్, హుజురాబాద్ డివిజనల్ పంచాయతీ అధికారి లతా, మండల పంచాయతీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
జారీ చేసిన వారు సహాయ సంచాలకులు సమాచార పౌర సంబంధాల శాఖ కరీంనగర్