DPRO KMNR తేదీ 6.9.2021 రోజున కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో భారీ వర్షాలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న రాష్ట్ర బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. పాల్గొన్న నగర మేయర్ జై సునీల్ రావు,జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్, మున్సిపల్ కమిషనర్ గరిమా అగర్వాల్ ( కరీంనగర్ జిల్లా)

పత్రికా ప్రకటన తేది 6.9.2021
కరీంనగర్

 

భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

వర్షాల పై మంత్రి గంగుల అధికారులతో సమీక్ష

అన్ని శాఖల అధికారులు క్షేత్ర స్థాయిలో ఉండాలి

రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్

00000

భారీ వర్షాల దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.

సోమవారం కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో మేయర్,జిల్లా కలెక్టర్ లతో కలసి వర్షాల పై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అధికార యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు క్షేత్ర స్థాయిలో ఉండి పర్యవేక్షించాలని అన్నారు. వరద నిర్వహణ కోసం శాశ్వత ప్రాతిపదికన పగడ్బందీగా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రోడ్డు మీద పడ్డ ప్రతి చుక్క డ్రైనేజీ లోకి వెళ్లే విధంగా ఫుట్ పాత్ లకు హోల్స్ వేయాలని సూచించారు.

ఈ సమావేశంలో నగర మేయర్ వై సునీల్ రావు, జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గరిమా అగర్వాల్, మున్సిపల్ వైస్ చైర్మన్ చల్లా స్వరూపరాణి,మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగాల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

సహాయ సంచాలకులు జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం కరీంనగర్ చే జారీ చేయనైనది

Share This Post