DPRO KMNR Date:07-07-2021: ప్రెస్ నోట్ : కరీంనగర్, జమ్మికుంట, చొప్పదండి, హుజురాబాద్, కొత్తపల్లి మున్సిపల్ కమిషనర్లు ,టౌన్ ప్లానింగ్ అధికారులతో ప్రిన్సిపల్ సెక్రెటరీ సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ,పట్టణ అభివృద్ధి ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్.

పత్రికా ప్రకటన

తేదీ 07 -07 -2021

కరీంనగర్

అనుమతి పొందిన దానికన్నా అధికంగా గృహ నిర్మాణాలు
చేసిన వారిపై కఠిన చర్యలు

రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ,పట్టణ అభివృద్ధి ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ .
000000

టిఎస్ బిపాస్ ప్రకారము అనుమతి పొందిన మేరకే భవన నిర్మాణాలు చేపట్టాలని దానికన్నా అధికంగా నిర్మాణాలు చేపట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణ అభివృద్ధి ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు.

గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కరీంనగర్, జమ్మికుంట, చొప్పదండి, హుజురాబాద్, కొత్తపల్లి మున్సిపల్ కమిషనర్లు ,టౌన్ ప్లానింగ్ అధికారులతో ప్రిన్సిపల్ సెక్రెటరీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణాలలో టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసి భవన నిర్మాణాలను తనిఖీ చేయించాలని ఆదేశించారు. అనుమతులు లేకుండా నిర్మించే భవన నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. టిఎస్ బి పాస్ ప్రకారం అనుమతి పొంది అనుమతి కన్నా అధికంగా నిర్మాణాలు చేపట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మున్సిపల్ యాక్ట్ పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. ప్రతి మున్సిపాలిటీ పరిధిలో 50 ఎకరాల స్థలాన్ని సేకరించి అభివృద్ధి చేయాలని, తద్వారా మునిసిపాలిటీలు ఆర్థికంగా బలోపేతం చెందుతాయని అన్నారు. పట్టణాలలో ప్రతి ఖాళీ స్థలంలో విరివిగా మొక్కలు నాటాలని అన్నారు. పట్టణాలలో నాణ్యత ప్రమాణాలతో పట్టణ ప్రకృతి వనాలను పెంచాలని అన్నారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య చర్యలు ముమ్మరంగా చేపట్టాలని ఆదేశించారు. ప్రతిరోజు చెత్తను బయటకి పంపించాలని ఆదేశించారు .అన్ని మునిసిపాలిటీలలో వార్డు సమావేశాలు నిర్వహించాలని సూచించారు. పట్టణాలలో నిర్మించిన పబ్లిక్ టాయిలెట్ లను వినియోగంలోకి తేవాలని అన్నారు. నగర ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఆన్లైన్ ద్వారా ఆస్తి పన్ను వసూలు చేయాలని అన్నారు.

ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ కె .శశాంక, లోకల్ బాడీస్ అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్, నగర పాలక సంస్థ కమిషనర్ వల్లూరి క్రాంతి, ట్రైనీ కలెక్టర్ మయాంక్ మిట్టల్, హుజురాబాద్, జమ్మికుంట, చొప్పదండి ,కొత్తపల్లి మున్సిపల్ కమిషనర్లు, టౌన్ ప్లానింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

జారీ చేసిన వారు సహాయ సంచాలకులు, సమాచార పౌర సంబంధాల శాఖ కరీంనగర్.

Share This Post