పత్రికా ప్రకటన 7.9.2021
కరీంనగర్
ప్రజలకు అండగా ప్రభుత్వ యంత్రాంగం – ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి
సహాయ చర్యల్లో రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్, పోలీస్ అధికార యంత్రాంగం
ప్రాణనష్టం, ఆస్థినష్టం జరగకుండా పూర్తి చర్యలు
రాష్ట్ర బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్
వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి
00000
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వ యంత్రాంగం అండగా ఉంటుందని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
గత వారం రోజులుగా ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ప్రభావితమైన కరీంనగర్ టౌన్, పరిసర లోతట్టు ప్రాంతాల్లో మంగళవారం ఉదయం మంత్రి పర్యటించారు పద్మనగర్, రేకుర్తి, రాంనగర్ తదితర ఏరియాల్లో రోడ్డు పనులు నడుస్తున్నందున వాటర్ నిలిచిపోయాయని, శాతవాహాన యూనివర్శిటీ వంటి కొన్ని ఓపెన్ ఏరియాల్లో వరదని 394 కాలువలోకి మల్లించామన్నారు. నగరంలో ప్రతీ ప్రాంతంలో నిలిచిపోయిన వాన నీటిని గంటన్నరలోపూ వివిద మార్గాల ద్వారా మల్లించే విదంగా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుందన్నారు, మొత్తం జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉందని అందరూ క్షేత్రస్థాయిలో ఉన్నారన్నారు. మున్సిపల్,రెవెన్యూ, ఇరిగేషన్, వాటర్ వర్క్స్, పోలీస్ శాఖలతో సహా అధికార యంత్రాంగం తీసుకుంటున్న చర్యల వల్ల ఇప్పటివరకూ ప్రాణనష్టం జరగలేదని, అక్కడక్కడ కొంత ఆస్థి నష్టం జరిగిందన్నారు. గతంలో గ్రౌండ్ వాటర్ ఎక్కువగా లేకపోవడం వల్ల వర్షాలు పడ్డప్పుడు ఆ నీరు గ్రౌండ్లోకి ఇంకిపోయి భూగర్భజలాలుగా మారేవని, కాళేశ్వరం వల్ల గత సీజన్ నుండి అన్ని జలాశయాలు నిండు కుండల్లా మారి గ్రౌండ్ వాటర్ లెవల్ ఇప్పటికే పెరిగాయని, అందువల్ల చిన్నవర్షాలు సైతం వరదలుగా మారుతున్నాయన్నారు, వీటిని ఎక్కడికక్కడ మానేరులోకి మల్లించే విదంగా చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి గంగుల కమలాకర్, మానేరు జలాశయం సైతం నిండి గేట్లు తెరుచుకున్నాయాన్నారు. ప్రక్రుతి విపత్తులు చెప్పి రావు, ప్రజలకు కలుగుతున్న ఇబ్బందుల్ని అత్యంత త్వరగా తొలగిస్తామని, ప్రజలు సైతం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని మంత్రి అన్నారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ సునీల్ రావు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.