పత్రికా ప్రకటన
తేదీ 07 -11- 2021
కరీంనగర్
ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి
ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ యం.వీర బ్రహ్మయ్య
కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ తో కలిసి పోలింగ్ కేంద్రాల సందర్శన, ఓటర్ల జాబితాల పరిశీలన
0000
18 సంవత్సరాలు నిండిన వారందరూ కొత్తగా ఓటర్ గా నమోదు అయ్యేందుకు, ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులు చేసుకోవాలనుకునే ఓటర్లు ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ యం. వీరబ్రహ్మయ్య తెలిపారు.
ఆదివారం జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ తో కలిసి నగరంలోని ముకరంపుర ప్రభుత్వ ఉన్నత ఉర్దూ మీడియం పాఠశాల, కార్ఖానా గడ్డ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కొత్తపల్లి మండలంలోని కొత్తపల్లి జెడ్ పి హెచ్ ఎస్, కరీంనగర్ రూరల్ మండలంలోని డుర్శెడ్ జడ్.పి.హెచ్.ఎస్ లలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటర్ల జాబితాలను పరిశీలించారు. అనంతరము బి ఎల్ వో లు, అంగన్వాడీ టీచర్లు, రిసోర్స్ పర్సన్ల తో మాట్లాడారు. కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ, ఓటర్ల జాబితాల సవరణ తదితర అంశాలపై వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ వీరబ్రహ్మయ్య మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం జరుగుతుందని అన్నారు. 01-01-2022 వరకు 18సంవత్సరాలు నిండిన వారందరిని ఓటర్ల జాబితాలో ఓటరుగా నమోదు చేయాలని బి ఎల్ వో లకు సూచించారు. 18 సంవత్సరాలు నిండిన వారందరిని ఫారం-6 ద్వారా కొత్త ఓటర్లుగా నమోదు చేయాలని తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఓటర్ల జాబితాలో చనిపోయిన వారి పేర్లను వారి సంబంధిత బంధువుల నుండి ఫారం-7 ద్వారా తీసుకొని లేదా సుమోటోగా తీసుకొని ఓటర్ల జాబితా నుండి వారి పేర్లను తొలగించాలని తెలిపారు. అలాగే డబుల్ ఓటర్లను గుర్తించి తొలగించాలని అన్నారు. శాశ్వతంగా వలస వెళ్ళిన వారిని గుర్తించి వారి పేర్లను ఓటర్ల జాబితా నుండి తొలగించాలని సూచించారు. ఒక పోలింగ్ స్టేషన్ పరిధిలో నివాసం ఉండి వేరే పోలింగ్ స్టేషన్ పరిధిలో ఓటరుగా నమోదై ఉంటే ఫారం -8 ద్వారా సరిచేయాలని సూచించారు. తప్పులు లేని ఆరోగ్యవంతమైన ఓటర్ జాబితా సిద్ధం చేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్. వి.కర్ణన్, కరీంనగర్ అర్బన్ తహసిల్దార్ సుధాకర్,కొత్తపల్లి తహసీల్దార్ శ్రీనివాస్,బి ఎల్ వో లు, అంగన్వాడీ టీచర్లు, రిసోర్స్ పర్సన్లు తదితరులు పాల్గొన్నారు.
సహాయ సంచాలకులు జిల్లా పౌరసంబంధాల అధికారి కరీంనగర్ చే జారీ చేయడమైనది