DPRO KMNR dt: 11.09.2021: ఫోటోలు & ప్రెస్ నోట్ : జిల్లా కోర్ట్ లోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనంలో ఏర్పాటు చేసిన జాతీయ లోక్ అదాలత్ ప్రారంభ సమావేశంలో మాట్లాతున్న జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రియదర్శిని ( కరీంనగర్ జిల్లా)

పత్రికా ప్రకటన

తేదీ 11-09 -2021

కరీంనగర్

రాజీ మార్గమే రాజమార్గం

లోక్ అదాలత్ లో ఒకే రోజులో కేసులు పరిష్కారం

కరీంనగర్ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రియదర్శిని
o0o

జాతీయ లోక్ అదాలత్ లో ఒకే రోజులో పెండింగ్ లో ఉన్న కేసులు పరిష్కరించ బడుతాయని కరీంనగర్ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రియదర్శని అన్నారు.

శనివారం జిల్లా కోర్టు లోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనములో ఏర్పాటు చేసిన జాతీయ లోక్ అదాలత్ ప్రారంభ సమావేషానికి జిల్లా జడ్జి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కోర్టులలో పెండింగులో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. కోవిడ్ చే కోర్టులు సరిగా పనిచేయ నందున ఎన్నో కేసులు కోర్టులో పెండింగ్ లో ఉన్నాయని , కేసుల పరిష్కారానికి ఎంతో మంది ఎదురుచూస్తున్నారని అన్నారు. అలాంటి వారందరూ ఈ లోక్ అదాలత్ లో కక్షిదారులు రాజీపడి త్వరగా కేసులు పరిష్కరించుకోవాలని సూచించారు . లోక్ అదాలత్ లో కేసుల సత్వర పరిష్కారం వలన కక్షిదారులకు సమయమూ, డబ్బూ ఆదా అవుతాయని తెలిపారు. కక్షిదారులు రాజీపడకుండా కోర్టులలో ఆలస్యంగా తీర్పులు వచ్చినా తిరిగి పై కోర్టుకు వెళ్లే అవకాశం ఉన్నందున కేసు అలాగే కొనసాగుతుందని తెలిపారు. లోక్ అదాలత్ లో పరిష్కరించబడిన కేసులకు తిరిగి పై కోర్టులకు అప్పీల్ చేసుకునే అవకాశం లేదని ఆమె తెలిపారు. ఈ జాతీయ లోక్ అదాలత్ లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలలోని 4వేల కేసులు పరిష్కరించుటకు గుర్తించామని తెలిపారు. ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్ జిల్లా లోని అన్ని కోర్టులలో 70 వేలకు పైగా కేసులు పెండింగ్ లో ఉన్నాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. రోజూ కొత్తగా కేసులు కోర్టులలో నమోదు అవుతూనే ఉంటాయని అన్నారు. . ఈ జాతీయ లోక్ అదాలత్ లో రాజీ పడదగిన క్రిమినల్ కేసులు, సివిల్ దావాలు, కుటుంబ తగాదా లకు సంబంధించిన కేసులు, చెక్కు బౌన్స్ కేసులు, మోటార్ చట్టం నకు సంబంధించిన రోడ్డు ప్రమాద కేసులు , బ్యాంకు చెక్ బౌన్స్ కేసులు, చిట్ ఫండ్ కేసులు, భూ తగాదాల కు సంబంధించిన కేసులు, కుటుంబ తగాదాలకు సంబంధించిన కేసులు, ఇరుపక్షాల కక్షిదారుల సమ్మతితో కేసులు ఒకే రోజు లో పరిష్కరించబడుతాయని ఆమె తెలిపారు. ఈ జాతీయ లోక్ అదాలత్ సదావకాశాన్ని కక్షిదారులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ గరిమ అగర్వాల్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సుజయ్ , బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రఘునందన్ రావు, అడిషనల్ డి సి పి చంద్రమోహన్ , తదితరులు పాల్గొన్నారు.

సహాయ సంచాలకులు సమాచార పౌర సంబంధాల శాఖ కరీంనగర్ చే జారీ చేయబడినది.

Share This Post