DPRO KMNR Dt.16.08.2021: ఫోటలు& ప్రెస్ నోట్: హుజురాబాద్ నియోజకవర్గంలో ని శాలపల్లిలో దళిత బంధు పథకాన్నీ లాంఛనంగా ప్రారంభించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు, పాల్గొన్న చీఫ్ సీక్రెటరీ సోమేశ్ కుమార్, మంత్రులు,పార్లమెంట్ సభ్యులు,శాసన సభ్యులు, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, తదితరులు (కరీంనగర్ జిల్లా)

పత్రిక ప్రకటన

తేది:16-08-2021

కరీంనగర్

 

ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు : రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు

 

 

రాష్ట్రంలో నీ ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు ఆర్థిక సహాయం అందజేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు.

 

రాష్ట్రంలో 17 లక్షల కుటుంబాలు, 70 లక్షల ఎస్సీ జనాభా ఉందని సిఎం తెలిపారు. వీరికి దళిత బంధు పథకం ఆర్థిక సహాయం చేసేందుకు 1 లక్షా 70 వేల కోట్ల రూపాయలు అవసరం అవుతాయని అన్నారు.

 

వచ్చే 3 నుంచి 4 సంవత్సరాల్లో ప్రతి ఏటా బడ్జెట్ లో 30 -40 కోట్లు కేటాయించి ప్రతి కుటుంబానికి దళిత బంధు ఆర్థిక సహాయం అందిస్తామని సిఎం పేర్కొన్నారు.

 

 

సోమవారం హుజూరాబాద్ నియోజవర్గం శాలపల్లి గ్రామంలో దళిత బంధు ను రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా 15 మంది లబ్ధిదారులకు రూ.10 లక్షల చొప్పున చెక్కులతో పాటు దళితబంధు ఎలక్ట్రానిక్‌ కార్డులను సీఎం అందజేశారు.

 

దళిత బంధు ప్రారంభించిన అనంతరం కార్యక్రమానికి హాజరైన అశేష జనవాహిని ఉద్దేశించి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మాట్లాడారు.

 

రైతు బంధు కూడ ఇదే వేదిక నుంచి ప్రారంభించా మని రాష్ట్రానికి మంచి ఫలితాలు వచ్చాయన్నారు. అదే మాదిరి

దళితబంధు పథకంతో దళితులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. రైతుబంధు పథకంతో తెలంగాణ రైతుల్లో ధీమా పెరిగిందని, రైతు బీమా పథకం కూడా విజయవంతంగా కొనసాగుతోందని అన్నారు.

 

తెలంగాణ ఉద్యమం ప్రారంభించిన్నప్పుడే కాదు, 24 గంటల ఉచిత విద్యుత్, మిషన్ భగీరథ , కాళేశ్వరం ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టినప్పుడు అనుమానాలు, అపోహలు

పడ్డారన్నారు. కొందరైతే గుట్టకు ఎంటిక కడుతున్నారని హేగతాలి చేశారని గుర్తు చేశారు.

సదుద్దేశ్యంతో చేపట్టిన కార్యక్రమాలు కాబట్టి వారి అనుమానాలు , అపోహలు దూరం చేస్తూ తిరుగులేని విజయాలు సాధించామని తెలిపారు.

 

 

తెలంగాణ సాధనలో

తొలి సింహ గర్జన నుంచి నేటి వరకూ కరీంనగర్

తెలంగాణ ప్రజలకు విజయం చేకూరుస్తున్న

వేదికగా మారిందన్నారు.

దళితబంధు ప్రభుత్వ కార్యక్రమం కాదని ఇది మహా ఉద్యమమని వ్యాఖ్యానించారు. ఈ ఉద్యమం కచ్చితంగా విజయం సాధించి తీరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. హుజూరాబాద్ ప్రజలు సాధించే విజయం భార‌త‌దేశ ద‌ళిత ఉద్య‌మానికి పునాది పడుతుంది. హుజూరాబాదే పునాది రాయి అవుతుందనీ సరికొత్త అధ్యాయం ను లిఖిస్తుందనీ తెలిపారు.

 

 

కరోనా వల్ల దళితబంధు ఆలస్యమైందని, దళితబంధు సరికొత్త చరిత్ర సృష్టిస్తుందన్నారు. తెలంగాణ సాకారమైనట్లే దళితుల అభివృద్ధి కూడా జరగాలని కోరారు.

 

15 రోజుల్లో మరో రూ.2వేల కోట్లు

 

హుజూరాబాద్ నియోజకవర్గానికి 15 రోజుల్లో మరో రూ.2వేల కోట్లు ఇస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలిపారు.

 

నియోజకవర్గంలో 21 వేల కుటుంబాలు ఉన్న‌ట్లు లెక్క ఉన్న‌ది. ఇంకో రెండు మూడు వేల కుటుంబాలు పెరిగే అవ‌కాశం ఉందన్నారు. రూ.500 కోట్లు ఇచ్చాం. మిగ‌తావి ఇస్తామన్నారు.

రాబోయే 15 రోజుల్లో ఇంకో 2 వేల కోట్లు ఇస్తానన్నారు. జిల్లా కలెక్టర్ ఖాతాతో జమ చేస్తామన్నారు.ఈ స్కీంకు బ్యాంకుల‌కు లింకేజీ ఉండ‌దు. కిస్తీలు క‌ట్టే కిరికిరి లేదన్నారు.

 

 

‘ఆ ప‌ది ల‌క్ష‌ల‌ను ఎలా వాడాల‌నేది తెలుసుకోవాలి. మీకు వ‌చ్చిన ప‌ని, న‌చ్చిన ప‌ని, విజ‌యం సాధించ‌గ‌లిగే ప‌ని చేసుకోవాలి. ఇవాళ ఓ ట్రాక్ట‌ర్ మీద డ్రైవ‌ర్ ప‌ని ఉంటే.. నువ్వే ఓన‌ర్ అవుతావు. ఒక షాపులో ప‌ని చేస్తే నువ్వే ఓన‌ర్ కావొచ్చు. ఓ ఇద్ద‌రు ముగ్గురు క‌లిసి రైస్ మిల్లు పెట్టుకోవచ్చు. అని చెప్పారు.

అందరూ ఒకే పని తలపెట్టకుండా వేరు వేరు పనులు చేపట్టాలన్నారు.

తెలంగాణ లో ఆర్థిక సహాయం పొందిన దళిత కుటుంబం ఎక్కడైనా షాప్ లు పెట్టుకోవచ్చు నన్నారు.

అన్నింటిలో దళితులకు రిజర్వేషన్ లు కల్పిస్తామని తెలిపారు.

 

 

సీఎంవో సెక్ర‌ట‌రీగా రాహుల్ బొజ్జా

 

ద‌ళిత బంధు ప‌థ‌కం ప్రారంభోత్స‌వ వేదిక‌పై ప్ర‌స్తుత ఎస్సీ సంక్షేమ‌ శాఖ సెక్ర‌ట‌రీగా ఉన్న రాహుల్ బొజ్జాను సీఎంవో సెక్ర‌ట‌రీగా నియ‌మిస్తున్న‌ట్లు సిఎం ప్ర‌క‌టించారు. రాహుల్ బొజ్జా ద‌ళితుడే. వాళ్ల నాన్న‌ బొజ్జా తార‌కం.. ఉద్య‌మంలో ప‌ని చేసిన వారికి న్యాయవాదిగా ఉన్నాడు. గొప్ప న్యాయ‌వాది. ఆయ‌న కుమారుడే రాహుల్ బొజ్జా. రాహుల్ బొజ్జా ఎస్సీ వెల్ఫేర్ సెక్ర‌ట‌రీగా ఉండ‌ట‌మే కాదు.. ముఖ్య‌మంత్రి కార్యాల‌యంలోనే సెక్ర‌ట‌రీగా ఉండాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాను. రేప‌ట్నుంచి నా కార్యాల‌యంలో సెక్ర‌ట‌రీగా ఉంటారు అని సీఎం శ్రీ కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.

 

 

కష్టపడి పనిచేసే కలెక్టర్ కర్ణన్

 

జిల్లా కలెక్టర్ కర్ణన్ మంచి అధికారి. కష్టపడి పనిచేస్తుండు. అతన్ని తానే స్వయంగా జిల్లా కలెక్టర్ గా నియమించాను అని ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రశంసించారు.

 

 

ఇచ్చిపుచ్చుకునే వారికి లేని బాధ మీకేoది

 

75 ఎండ్ల భారత స్వాతంత్ర్య చరిత్రలో దళితులకు 10 లక్షల ఇవ్వాలని ఎవ్వరైనా మాట్లాడిండ్రా…

దళితులకు ఐదు రూపాయలు ఇవ్వమని అడగలేనీ వారు దళిత బంధు పథకం ప్రారంభించగానే పక్కన బాంబులు పెట్టినట్టు

అదిరిపడుతుర్రు.

ఇల్లు సంసారం చక్క పెట్టినట్టు లెక్క పక్క చూసుకుంటూ రాష్ట్రాన్ని చక్కబెట్టిన .

 

ఇచ్చే వాళ్ళం మేమున్నాం, తీసుకునే వారు వాళ్ళున్నారు. మధ్యల మీకేం బాధ అంటూ సిఎం ప్రశ్నించారు.

 

రాష్ట్ర మంత్రి శ్రీ కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ..

 

దళిత బంధు పథకంతో దళితుల జీవితాల్లో కొత్త అధ్యాయం మొదలైంది అని అన్నారు.

ఈ సాహసోపేతమైన కార్యక్రమాన్ని చేపట్టిన ముఖ్యమంత్రికి శిరస్సు వంచి నమస్కరిస్తున్న ట్లు మంత్రి తెలిపారు.

 

దళిత బంధు సక్రమంగా అమలైతే దళితుల జీవితాల్లో వెలుగులు నిండుతాయన్నారు.

దళిత బంధు పై కొందరు కావాలని చేస్తున్న కుట్రలను ఎదిరించాలని సూచించారు.

 

ఈ పథకాన్ని అమలు చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రికి కొండంత ధైర్యాన్ని ఇవ్వాలి అన్నారు. అవసరమైన సమయాల్లో వెన్నంటే ఉండాలన్నారు .

 

జారీ చేసిన వారు సహాయ సంచాలకులు, సమాచార పౌర సంబంధాల శాఖ కరీంనగర్

Share This Post