DPRO KMNR dt: 16.09.2021: దళిత కుటుంబాలు అందరికి దళిత బంధు డబ్బులు జమ: జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్.

తేదీ 17-09 -2021

కరీంనగర్

దళిత కుటుంబాలు అందరికీ
దళిత బంధు డబ్బులు జమ

ఇప్పటివరకు 14400 మందికి డబ్బులు బ్యాంక్ అకౌంట్లో జమ

రోజువారీగా డబ్బులు దళితుల అకౌంట్లో జమ చేస్తాం

జిల్లా కలెక్టర్ ఆర్.వి కర్ణన్
O0000

హుజూరాబాద్ నియోజకవర్గం లోని 14400 మంది దళితుల అకౌంట్లలో దళిత బంధు పథకం డబ్బులను జమ చేయడం జరిగిందని ఇంకా మిగిలి ఉన్న దళితుల అకౌంట్లలో రోజువారి గా జమ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ తెలిపారు.

హుజురాబాద్ నియోజకవర్గం లోని ఒక మండలం లో ఒకరి కి ఆధార్ కార్డు లో సాంకేతిక పొరపాటు ( టెక్నికల్ మిస్టేక్ ) వల్ల దళిత బంధు నిధులు వారి అకౌంట్లో జమ అయ్యాయని తెలిపారు. ఇంకా మిగిలి ఉన్న వారి దళితుల అకౌంట్లలో రోజువారీగా డబ్బులు జమ అవుతాయన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గం లోని అన్ని దళిత కుటుంబాలకు వారి అకౌంట్లలో డబ్బులు పడుతాయని అన్నారు.

Share This Post