పత్రిక ప్రకటన
తేదీ: 23-8-2021
కరీంనగర్
సమర్థవంతంగా ల్యాండ్ పూలింగ్ సర్వే చేయాలి
– జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్
00000
జిల్లాలో ల్యాండ్ పూలింగ్ సర్వేను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ అన్నారు.
సోమవారం రాత్రి కలెక్టరేట్ ఆడిటోరియంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మరియు శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో ల్యాండ్ పూలింగ్ పై నిర్వహించిన వర్క్ షాప్ లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని మండలాల్లో రోడ్డుకు ఆనుకుని ఉండేలా ల్యాండ్ పూలింగ్ సర్వే చేయాలన్నారు. రైతులను ఒప్పించి స్థలాలు సేకరించాలని తెలిపారు. ల్యాండ్ పూలింగ్ వల్ల భవిష్యత్తులో స్థలాలకు మంచి డిమాండ్ ఉంటుందన్నారు. రైతులకు కూడా లాభసాటిగా ఉంటుంది అన్నారు.
ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ రామకృష్ణారావు, అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్, టౌన్ ప్లానింగ్ అధికారి సురేష్, మున్సిపల్ కమిషనర్ వల్లూరి క్రాంతి, ఆర్ డి ఓ ఆనంద్ కుమార్, తాసిల్దార్లు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
సహాయ సంచాలకులు, జిల్లా పౌర సంబంధాల శాఖ కార్యాలయం కరీంనగర్ వారిచే జారీ చేయడమైనది.
———–