DPRO KMNR dt.24.04.2021: ఫోటోలు & ప్రెస్ నోట్: పాఠశాలలో పరిశుభ్రత పనుల పై అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ ( కరీంనగర్ జిల్లా)

పత్రికా ప్రకటన
తేదీ 24-08-2021

కరీంనగర్

పాఠశాలలో పారిశుద్ధ్య పనులు మంగళవారం నుండే ప్రారంభించాలి.

జిల్లా కలెక్టర్ ఆర్.వి కర్ణన్
O0o

ప్రభుత్వం సెప్టెంబర్ 1 నుండి పాఠశాలలు పునః ప్రారంబి స్తున్నందున జిల్లాలోని అన్ని పాఠశాలలో, అంగన్వాడి కేంద్రాలలో పారిశుద్ధ్య పనులను మంగళవారం నుండే ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ ఆర్.వి కర్ణన్ అధికారులను ఆదేశించారు.

మంగళవారం రాష్ట్ర విద్యాశాఖ, గ్రామీణ అభివృద్ధి శాఖల మంత్రుల వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో పాఠశాలలో పరిశుభ్రత పనులపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రభుత్వ , ప్రైవేటు పాఠశాలలో, అంగన్వాడీ కేంద్రాలలో, పారిశుద్ధ్య పనుల నిర్వహణపై మండల విద్యాధికారులు పూర్తి పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అన్ని విద్యాసంస్థ లలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను మండల విద్యాధికారులు తనిఖీ చేయాలని ఆదేశించారు. సెప్టెంబర్ 1న అన్ని పాఠశాలలు ప్రారంభించుటకు వీలుగా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు ఆగష్టు 30లోగా పూర్తి చేయాలని కలెక్టర్ జిల్లా విద్యాధికారి ని ఆదేశించారు . జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు , సంక్షేమ వసతి గృహాలు, గురుకుల పాఠశాలలో శానిటేషన్ పనులు వారం రోజుల్లో పూర్తిస్థాయిలో చేయాలని ఆదేశించారు. అన్ని పాఠశాలలు, వసతి గృహాల పరిధిలో ఆంటీ లార్వా చేయాలని,అన్ని పాఠశాలల్లో ముఖ్యంగా టాయిలెట్లను శుభ్ర పరచాలని అన్నారు. త్రాగు నీటి ట్యాంకులను క్లోరినేషన్ చేయాలని ఆదేశించారు . పాఠశాలలకు మిషన్ భగీరథ నల్ల కలెక్షన్ ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు .అన్ని పాఠశాలలు అంగన్వాడీ కేంద్రాల్లో వసతిగృహాలలో డ్రైడే నిర్వహించాలని అన్నారు. సెప్టెంబర్ 1న పాఠశాలలు ప్రారంభించుటకు వీలుగా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అన్ని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, వసతిగృహాలలో పారిశుద్ధ్య చర్యలు పూర్తిచేసినట్లు ప్రధానోపాధ్యాయుల ద్వారా సర్టిఫికెట్స్ తీసుకోవాలని ఎంపీడీవో లకు కలెక్టర్ సూచించారు. విద్యార్థులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ, మాస్కులు ధరిస్తూ పాఠశాలకు హాజరు కావాలని సూచించారు. పాఠశాలకు రావాలని విద్యార్థులను బలవంతం చేయకూడదని సూచించారు . తల్లిదండ్రుల సమ్మతితో విద్యార్థులను పాఠశాలలకు తీసుకురావాలని అన్నారు.

ఈ సమావేశంలో లోకల్ బాడీస్ అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్, జిల్లా విద్యాధికారి జనార్దన్ రావు, జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య, మిషన్ భగీరథ ఎస్ .ఈ. అమరేందర్ రెడ్డి, డివిజనల్ పంచాయతీ అధికారి హరికిరణ్ తదితరులు పాల్గొన్నారు.

సహాయ సంచాలకులు, సమాచార పౌర సంబంధాల శాఖ కరీంనగర్ గారిచే జారీ చేయబడినది

Share This Post