DPRO KMNR Dt:06.09.2021:photos & Press note :జిల్లా కోర్టులో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రియదర్శిని ( కరీంనగర్ జిల్లా)

పత్రికా ప్రకటన

తేదీ 06-09 -2021

కరీంనగర్

ఈనెల 11న జాతీయ లోక్ అదాలత్

జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రియదర్శిని
0000

సెప్టెంబర్ 11న జిల్లా కోర్టులలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించబడుతుందని కరీంనగర్ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రియదర్శని తెలిపారు.

సోమవారం సాయంత్రం జిల్లా కోర్టులో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆమె పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ జాతీయ న్యాయ సేవా అధికార సంస్థ ఢిల్లీ, తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ వారి ఆదేశానుసారం జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కరీంనగర్ ఆధ్వర్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలలోని అన్ని కోర్టులలో సెప్టెంబర్ 11న జాతీయ లోక్ ఆదాలత్ లు నిర్వహించబడుతాయని ఆమె తెలిపారు. ఈ జాతీయ లోక్ అదాలత్ లో రాజీ పడదగిన క్రిమినల్ కేసులు, సివిల్ దావాలు, కుటుంబ తగాదా లకు సంబంధించిన కేసులు, చెక్కు బౌన్స్ కేసులు, మోటార్ చట్టం నకు సంబంధించిన రోడ్డు ప్రమాద కేసులు , బ్యాంకు చెక్ బౌన్స్ కేసులు, చిట్ ఫండ్ కేసులు, భూ తగాదాల కు సంబంధించిన కేసులు, కుటుంబ తగాదాల కు సంబంధించిన కేసులు, ఇరుపక్షాల కక్షిదారుల సమ్మతితో కేసులు ఒకే రోజు లో పరిష్కరించబడుతాయని ఆమె తెలిపారు. ఈ జాతీయ లోక్ అదాలత్ ద్వారా కక్షిదారులకు సమయము వృధా కాదని, డబ్బులు వృధా కావని ,ఈ సదవకాశాన్ని కక్షిదారులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. జాతీయ లోక్ అదాలత్ లలో పరిష్కరించ బడిన కేసులు, తిరిగి పై కోర్టులకు అప్పీలు చేసుకొనుటకు వీలులేదని ఆమె తెలిపారు. సెప్టెంబర్ 11న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ లో 4,943 కేసులను పరిష్కరించుటకు ఇంతవరకూ గుర్తించామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి తెలిపారు . న్యాయవాదులు కూడా కోర్టులలో పెండింగ్ లో ఉన్న కేసులకు సంబంధించి కక్షిదారు లతో సంప్రదించి జాతీయ లోక్ అదాలత్ లో కేసుల పరిష్కారం కొరకు సహకరించాలని ఆమె కోరారు.

ఈ పాత్రికేయుల సమావేశంలో జిల్లా అదనపు న్యాయమూర్తి భవాని చంద్ర ,జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి సుజయ్, బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు రఘునందన్ రావు పాల్గొన్నారు.

సహాయ సంచాలకులు సమాచార పౌర సంబంధాల శాఖ కరీంనగర్ చే జారీ చేయబడినది.

Share This Post