DPRO KMNR Dt:13-09-2021: ఫోటోలు & ప్రెస్ నోట్: వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈ.వి.ఎం. గోడౌన్ లో గల ఈ.వి.ఎం. లను, వి.వి. ప్యాడ్ లను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ ( కరీంనగర్ జిల్లా)

పత్రికా ప్రకటన

తేదీ:13-09-2021

ఈ.వి.ఎం. ల మొదటి స్థాయి తనిఖీ

జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్
000

హుజురాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నికలు త్వరలో ఉన్నందున ఈ.వి.ఎం. ల మొదటి స్థాయి (ఫస్ట్ లెవల్ చెకింగ్) చేసినట్లు జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ అన్నారు.

సోమవారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈ.వి.ఎం. గోడౌన్ లో గల ఈ.వి.ఎం. లను, వి.వి. ప్యాట్ లను తనిఖీ చేసినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హుజురాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నిక త్వరలో ఉన్నందున ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ.వి.ఎం. లు, వి.వి. ప్యాట్ ల మొదటి స్థాయి తనిఖీ వివిధ రాజకీయ రాజకీయ పార్టీ ల ప్రతినిధుల సమక్షంలో తనిఖీ చేసినట్లు తెలిపారు. ఈ.వి.ఎం. ల మొదటి స్థాయి తనిఖీ పట్ల వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేసినట్లు కలెక్టర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్, కలెక్టరేట్ ఏవో లక్ష్మారెడ్డి , బిజెపి, కాంగ్రెస్, టిఆర్ఎస్, తెలుగుదేశం పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

సహాయ సంచాలకులు, జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం కరీంనగర్ వారిచే జారీ చేయడమైనది.

Share This Post