పత్రికా ప్రకటన తేదీ :23-08 -2021
కరీంనగర్
దళితబంధు పథకానికి మరో 500 కోట్ల నిధులు మంజూరు
జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్
00000
దళితబంధు పథకం అమలుకు మరో 500 కోట్లు నిధులు ప్రభుత్వం మంజూరు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం హుజురాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు పథకాన్ని పైలేట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి అమలు చేస్తుందని తెలిపారు. దళిత బంధు పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే 500 కోట్లు విడుదల చేసిందని, మరో 500 కోట్లు సోమవారం విడుదల చేసినట్లు కలెక్టర్ తెలిపారు. మొత్తం ఇంత వరకు దళిత బంధు పథకం అమలుకు రెండు విడుతలలో వెయ్యి కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు కలెక్టర్ తెలిపారు. దళిత బంధు పథకం హుజురాబాద్ నియోజకవర్గంలో పకడ్బందీగా అమలు చేయుటకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. గ్రామాలలో మున్సిపాలిటీలలో ప్రతి దళిత కుటుంబాల ఇంటింటికి అధికారుల బృందాలు వెళ్లి లబ్ధిదారులను ఎంపిక ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించుటకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. లబ్ధిదారులందరికి బ్యాంకులలో తెలంగాణ దళిత బంధు కొత్త అక్కౌంట్ ను తెరుచుటకు అధికారులకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. దళిత బంధు లబ్ధిదారులు తమ యూనిట్ల ఎంపిక లో కూడా అధికారులు తగిన సూచనలు, సలహాలు ఇస్తారని తెలిపారు.
సహాయ సంచాలకులు, జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం కరీంనగర్ చేజారీచేయనైనది
