DPRO MULUGUఅడవులను రక్షించు కోవడం అందరి బాధ్యత:జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య

ప్రచురణార్థం
ములుగు జిల్లా
నవంబర్ -10,( బుధవారం).

అడవులను రక్షించు కోవడం అందరి బాధ్యత అని,
పోటు భూములకు హక్కు పత్రాలు పొందుటకు సరియైన ఆధారాలు ఉన్నట్లు అయితే ప్రతి ఒక్కరు ధరకాస్తు చేసుకోవచ్చునని జిల్లా కలెక్టర్ అన్నారు.

బుదవారం రోజున జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య గారు మాట్లాడుతూ జిల్లాలో ప్రతిష్ట ఆత్మ కంగా చేపట్టిన పోడు భూముల సమస్యల పైన మరియు 2022 పిబ్రవరి 16 నుండి 19 వరకు జరుగు మేడారం మహా జాతర ఏర్పాట్ల గురించి మాట్లాడారు. పోడు భూములకు డిసెంబర్ 13, 2005 సంవత్సరం నుండి పోడు భూముల్లో వ్యసాయం చేసుకునే వారు పూర్తి ఆధారాలతో ధరకాస్తు చేసుకోవాలని, చేసుకున్న ధరకాస్తు ను ఆర్ ఓ ఎఫ్ ఆర్ ఆక్ట్ ప్రకారం హాబీటేషన్స్ వారీగాఎఫ్ఆర్సీ కమిటీలను ఏర్పాటు చేసి ప్రభుత్వ నిబంధనల మేరకు గుర్తించడం జరుగుతుందని కలెక్టర్ అన్నారు.
ప్రజలకు పోడు భూముల పై పూర్తి అవగాహన కల్పించడం జరిగిందని అన్నారు. ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవచ్చు నని అన్నారు. గిరిజన గ్రామాల్లో కమిట్ సభ్యులు గిరిజనులే ఉండాలని, నాన్ ట్రైబల్ ఉన్నచోట నిబంధనల మేరకు కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు.

మేడారం మహా జాతర ఏర్పాట్ల గురించి జీ ఓ వచ్చి ఉందని మంత్రిగారు,ఎంపి గారు, ఎమ్మెల్యే గర్ల చొరవతో మేడారం బడ్జెట్ త్వరగా పెప్పించుకొగలిగాం అన్నారు. మేడారం కి 75 కోట్లు మంజూరు కాగా 25 కోట్ల పనులకు టెండర్స్ పిలిచి పనులు ప్రారంభించాం అన్నారు.
జనవరి చివరి కల్ల పూర్తి చేస్తాం అన్నారు. పార్కింగ్ అనేది ఐటిడిఎ నుండి ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.

సివిల్ వర్క్స్ 41 కోట్లు,నాన్ సివిల్ వర్క్స్ 34 కోట్లు కేటాయించడం జరిగిందని అన్నారు. మేడారం లో జంపన్న వాగులో 15 నుండి 20 ఫీట్స్ లోతు ఉన్నందున కొంత ప్రాణ నష్టం కూడా జరిగిందని వాటి లేవలింగ్,
బట్టలు మార్చుకొనుటకు గదుల నిర్మాణం,3 సులన్ కాంప్లెక్స్, ఓవర్ హెడ్ ట్యాంకల నిర్మాణం,మరియు 5 షేడ్స్ నిర్మాణం గత ఏడాది నిర్మించిన షేడ్స్ ను పూర్తిగా ప్రజలకు ఉపయోగార్ధము వినియోగించు కొనుటకు వీలుగా కరెంట్,త్రాగు నీటి సౌకర్యం, మరుగు దొడ్లు నిర్మాణం కోసం 3 వర్కర్స్ ను పెట్టు ప్రజల సౌకర్యార్థం ఉచితంగా ఉపయోగించు కోవవచ్చున్నన్నారు.వాటిని గ్రామ పంచాయితీ పరిధిలో ఉంటాయని, షేడ్స్ వెళ్ళే దారిలో సీసీ రోడ్ల నిర్మాణ, రోడ్ల మరమత్తులు, కమ్యుని టాయిలెట్స్ నిర్మాణం తదితర వర్క్స్ జరుగుతున్నాయని అన్నారు.

Share This Post