DPRO MULUGU:కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన గిరిజన విద్యార్థినీ విద్యార్థులకు ప్రభు త్వ అండగా ఉంటుంది:జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య

* ప్రచురణార్థం * ములుగు జిల్లా
నవంబర్ 22 సోమవారం
కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన గిరిజన విద్యార్థినీ విద్యార్థులకు ప్రభు త్వ పరంగా

అందించే సహాయ సహకారాలను వెంటనే మంజూరు చేసే విధంగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ మరియు ఇన్చార్జి ఐటిడిఎ పిఓ కృష్ణ ఆదిత్య గిరిజన సంక్షేమ అధికారులను ఆదేశించారు.
సోమవారం రోజున ప్రాజెక్ట్ అధికారి విధుల్లో భాగంగా ఎటునాగారం ఐటిడిఏ కార్యాలయంలో ఐ టి డి ఎ స్పెషల్ ఆఫీసర్స్ తో సమావేశం ఏర్పాటు చేసి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు వసతి గృహాలలో మౌలిక వసతుల కల్పనపై ప్రతిపాదనలు సిద్ధం చేయుట, రివ్యూ సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 45 ఇన్స్టిట్యూషన్స్ పాఠశాల పున ప్రారంభం అయ్యా యని గిరిజన విద్యా ప్రమాణాలను మెరుగుపరచడం కొరకు ప్రత్యేక అధికారులు నియమించి క్షేత్రస్థాయిలో పర్యవేక్షించడం జరుగుతుందని, విద్యార్థులు హాజరు శాతం పెరుగుతుంది ఆశ్రమ పాఠశాలలు వసతి గృహాల్లో ఏ ఒక్క గిరిజన విద్యార్థి చదువును కోల్పోకూడదు అని అన్నారు. వారికి అన్ని వసతులు కల్పించాలని కాంపౌండ్ వాల్ నిర్మాణం టాయిలెట్స్ ఏ మరమ్మతులు ఉన్న చేయించాలని పిల్లల ఆరోగ్య పరిస్థితి ఎప్పటికప్పుడు గమనించడం కొరకు ఏఎన్ఎంలు తప్పక ఉండాలని అన్నారు ఏ ఎన్ ఎం శాలరీలు పెండింగ్లో ఉంటే తన దృష్టికి తీసుకురావాలని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు
ఇన్స్టిట్యూషన్ వైస్ బడ్జెట్ రిక్రూమెంట్ హెడ్ ఆఫ్ ఎకౌంటు వారీగా పెండింగ్ బిల్స్ లేకుండా ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు గిరిజన విద్యార్థిని విద్యార్థులకు ప్రత్యేక తరగతులు ద్వారా ఉదయం సాయంత్రం విద్యాబోధన జరగడంతో పాటు వారి నైపుణ్యాలను పరీక్షించడం కొరకు బేసిక్ టెస్టులు ఏర్పాటుచేసి విద్యార్థులను గ్రేడ్లు వారీగా పరిశీలించి వారి నైపుణ్యాలకు పదును పెట్టాలని అన్నారు. ట్రైబల్ రిలీఫ్ ఫండ్ ద్వారా కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు పరిహారం అందజేయడంతో పాటు వైద్యపరంగా ఏమైనా ఆస్పత్రిలో చికిత్స తీసుకుని ఉంటే మెడికల్ రీఎంబర్స్మెంట్ సౌకర్యం కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు .దారిద్య్ర రేఖకు దిగువన ఉండి అనుకోని విపత్తుల కారణంగా గిరిజనులు ఇండ్లు కూలిపోయి మరమ్మతులకు గురైన వాటికి ఇంటి మరమ్మతులు అయ్యే ఖర్చులు ఐటీడీఏ ద్వారా అందజేస్తామన్నారు. గిరిజన విద్యార్థులు కొంతమంది ఉన్నత చదువుల కోసం కాలేజీలకు వెళ్ళినప్పుడు గిరిజన సంక్షేమ విద్యా విభాగం ద్వారా ఉన్నత చదువులకు సహాయ సహకారాలు అందిస్తామన్నారు కాలేజీలకు వెళ్లే విద్యార్థులకు ల్యాప్ టాప్స్ కావాలని దరఖాస్తులు సమర్పిస్తారని వారి విద్యార్హతలను పరిశీలించి ల్యాప్ టాప్స్ అందిస్తామన్నారు. గిరిజన పిల్లల ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ అవ్వాలంటే మనమందరం మనసుపెట్టి పని చేసినట్లైతే వారిని భావిభారత పౌరులుగా తీర్చిదిద్ది వారమవుతా మనీ ప్రత్యేక అధికారులకు
హితబోధ చేశారు
ఈ కార్యక్రమంలో ఏ పీ ఓ వసంతరావు ,sdc ట్రైబల్ వెల్ఫేర్ శ్రీ రాములు ,డిడి ట్రైబల్ వెల్ఫేర్ ఎర్రయ్య,E,E ట్రైబల్ వెల్ఫేర్ హేమలత, ఎస్ .వో .రాజ్ కుమార్ , ఐటీడీఏ పరిపాలనాధికారి దామోదర్ స్వామి ఐటీడీఏ మేనేజర్ లాల్ నాయక్, సంబంధిత ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు

Share This Post