DPRO MULUGU*ప్రజల సమస్యలను పరిష్కరించడంలో జిల్లా అధికార యంత్రాంగం బాధ్యతగా వ్యవహరించాలని: జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య*

*ప్రజల సమస్యలను పరిష్కరించడంలో జిల్లా అధికార యంత్రాంగం బాధ్యతగా వ్యవహరించాలని: జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య*

ప్రజల సమస్యలను పరిష్కరించడంలో జిల్లా అధికార యంత్రాంగం బాధ్యతగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య తెలిపారు.

సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు జిల్లా కలెక్టర్ కు వివిధ సమస్యలపై దరఖాస్తు పెట్టుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రజల సమస్యలను పరిష్కరించడానికి జిల్లా అధికార యంత్రాంగం కృషి చేస్తుందని, ప్రజల నుంచి వచ్చిన సమస్యలు, భూ సమస్యలు, ఉద్యోగాలు,ఉపాధి రుణాలు , డబుల్ బెడ్ రూమ్, పెన్షన్ అర్జీలను పరిశీలించి సంబంధిత శాఖల ద్వారా పరిష్కారానికి చర్యలు చేపట్టడం జరుగుతుందని అన్నారు.
ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ ప్రజా వాణి లో వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా అధికారులను ఆదేశించారు.
సోమవారం నాడు నిర్వహించిన ప్రజావాణి లో వచ్చిన దరఖాస్తులు 21 రాగా, గతంలో వచ్చిన దరఖాస్తులు 3698 కాగా , అందులో 73 దరఖాస్తు పెండింగ్లో ఉన్నవని, వాటిలో అధిక శాతం మిషన్ భగీరథ శాఖ వారి దరఖాస్తు లు పెండింగ్ లో ఉన్నాయని , వాటిని త్వరిత గతిన పూర్తిచేయాలని మిషన్ భగీరథ అధికారిని ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ ఆదేశించారు. మిగతా శాఖల పెండింగ్ దరఖాస్తు త్వరగా పరిష్కరించాలని జిల్లా అధికారుల నుద్దేశించి వారు అన్నారు.

ఈ కార్యక్రమం లో డిఆర్వో మరియు ఇంచార్జ్ అదనపు కలెక్టర్( రెవెన్యు) రమాదేవి, జిల్లా డిఆర్డిఓ నాగ పద్మజా, వైద్యాధికారి డా. అప్పయ్య , డిసిఓ సర్దార్ సింగ్, మైనింగ్ శాఖ అధికారి రఘుబాబు,జిల్లా పశు వైద్య అధికారి డా. విజయ్ భాస్కర్ , ఆప్కారి శాఖ సీఐ శశి కుమారి, బీసీ సంక్షేమ శాఖ, అధికారి ఎస్ లక్ష్మణ్, షెడ్యూల్ కులాల అభివృద్ధి సంక్షేమ శాఖ, పి భాగ్యలక్ష్మి, తదితర జిల్లా అధికారులు కలెక్టరేట్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు .

Share This Post