DPRO MULUGU:ప్రభుత్వ ఆస్పత్రులలో ప్రజలకు మెరుగైన వైద్య వైద్య సేవ లే లక్ష్యంగా వైద్యాధికారులు పనిచేయాలి :జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య

ప్రచురణార్థం * ములుగు జిల్లా
నవంబర్ 9 ( మంగళవారం ).

ప్రభుత్వ ఆస్పత్రులలో ప్రజలకు మెరుగైన వైద్య వైద్య సేవ లే లక్ష్యంగా వైద్యాధికారులు పనిచేయాలని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య అన్నారు

మంగళవారం రోజున జిల్లా కలెక్టర్ ఏటూరునాగారం పర్యటనలో భాగంగా కన్నాయిగూడెం లో పర్యటించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా పరిశీలించి కోవిడ్ టెస్టులు వివరాలు, డ్రగ్స్ రూము పరిశీలించి అన్ని వ్యాధులకు మందులు అందుబాటులో ఉన్నాయా లేదా హైరిస్క్ కేసుల వివరాలు , డెలివరీ వివరాలు సిబ్బంది మూమెంట్ రిజిస్టర్ క్షుణ్ణంగా పరిశీలించి పలు సూచనలు సలహాలు అందించారు. అనంతరం కలెక్టర్ స్వయంగా, బిపి బ్లడ్ టెస్ట్ చేయించుకుని ప్రజలందరికీ ఆదర్శంగా నిలిచారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యాధికారులు సిబ్బంది సమయపాలన పాటించాలని, ఆన్లైన్ అటెండెన్స్ తప్పని సరి అన్నారు. సిబ్బంది బయటికి వెళ్లినప్పుడు మూమెంట్ రిజిస్టర్ లో నమోదు చేయాలని మెడికల్ ఆఫీసర్ నవీన్ ను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అనంతరం కన్నాయిగూడెం మండలం రాజన్నపేట అంగన్వాడి కేంద్రాన్ని పరిశీలించారు చిన్నారులకు, గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం అందిస్తున్న రాలేదా అనే విషయాన్ని అంగన్వాడి టీచర్ ని అడిగి తెలుసుకున్నారు ఏజెన్సీప్రాంతం కాబట్టి గిరిజన చిన్నారులు పోషకాహారం అందకఇబ్బందులు పడతారని అటువంటి వారిని గుర్తించి అంగన్వాడి సెంటర్ లో నాణ్యమైన పోషకాలు అందించడంతో పాటు వారి ఆరోగ్య పరిరక్షణ కై కృషి చేయాలని అంగన్ వాడి టీచర్ లక్ష్మి కాంతం ను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో కన్నాయిగూడెం తాసిల్దార్ దేవ్ సింగ్ సర్పంచ్ ఆనం ప్రభాకర్ గ్రామస్తులు ప్రజలు పాల్గొన్నారు.

Share This Post